'యమదొంగ' కి పదేళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌నే మార్చివేసిన చిత్రం 'సింహాద్రి'. దర్శకమౌళి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తరువాత తారక్‌కి.. ఆ తరువాత నాలుగేళ్ల పాటు ఆశించిన విజయాలు దక్కలేదు. అయితే మళ్లీ ఆ లోటుని తీర్చింది మాత్రం రాజమౌళినే. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి' తరువాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆ చిత్రమే 'యమదొంగ'. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా.. యముడిగా మోహన్‌బాబు నటించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు, వారు పలికే డైలాగులు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అలాగే 'యంగ్ యమ' పాట కోసం గ్రాఫిక్స్‌లో రూపొందిన సీనియర్ ఎన్టీఆర్‌తో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులేయ్యడం నందమూరి అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను అలరించిన అంశం.
అప్పటివరకు బొద్దుగా ఉన్న ఎన్టీఆర్.. ఈ చిత్రం కోసం బరువు తగ్గి కనిపించడమే కాకుండా.. కొత్త రకమైన స్టెప్స్‌కి నాంది పలికారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాచోరే నాచోరే' పాట తారక్‌లో ఎంత మంచి డ్యాన్సర్ ఉన్నాడో మరోసారి చాటి చెప్పింది. ప్రియమణి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రంభ, ప్రీతిజింగ్యాని, వేద, నవనీత్‌కౌర్ ప్రత్యేక గీతాలలో తళుక్కుమన్నారు. ఇక సీనియర్ నటి కుష్బూ యముడికి భార్యగా కనిపించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతంలోని పాటలన్నీ ఆదరణ పొందాయి. 2007 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నేటితో పదేళ్లు పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments