'యమదొంగ' కి పదేళ్లు

  • IndiaGlitz, [Tuesday,August 15 2017]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌నే మార్చివేసిన చిత్రం 'సింహాద్రి'. ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం త‌రువాత తార‌క్‌కి.. ఆ త‌రువాత నాలుగేళ్ల పాటు ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. అయితే మ‌ళ్లీ ఆ లోటుని తీర్చింది మాత్రం రాజ‌మౌళినే. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి' త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఆ చిత్ర‌మే 'య‌మ‌దొంగ‌'. సోషియో ఫాంట‌సీ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించ‌గా.. య‌ముడిగా మోహ‌న్‌బాబు న‌టించాడు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, వారు ప‌లికే డైలాగులు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అలాగే 'యంగ్ య‌మ' పాట కోసం గ్రాఫిక్స్‌లో రూపొందిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టెప్పులేయ్య‌డం నంద‌మూరి అభిమానుల‌నే కాదు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అంశం.

అప్పటివ‌ర‌కు బొద్దుగా ఉన్న ఎన్టీఆర్‌.. ఈ చిత్రం కోసం బ‌రువు త‌గ్గి క‌నిపించ‌డ‌మే కాకుండా.. కొత్త ర‌క‌మైన స్టెప్స్‌కి నాంది ప‌లికారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాచోరే నాచోరే' పాట తార‌క్‌లో ఎంత మంచి డ్యాన్స‌ర్ ఉన్నాడో మ‌రోసారి చాటి చెప్పింది. ప్రియ‌మ‌ణి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో రంభ‌, ప్రీతిజింగ్యాని, వేద‌, న‌వ‌నీత్‌కౌర్ ప్ర‌త్యేక గీతాల‌లో త‌ళుక్కుమ‌న్నారు. ఇక సీనియ‌ర్ న‌టి కుష్బూ య‌ముడికి భార్య‌గా క‌నిపించారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతంలోని పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. 2007 ఆగ‌స్టు 15న విడుద‌లైన ఈ చిత్రం నేటితో ప‌దేళ్లు పూర్తిచేసుకుంటోంది.

More News

'అమ్మాయి ప్రేమలో పడితే' మోషన్ పోస్టర్ రిలీజ్

అరిగెల ప్రొడక్షన్స్ బేనర్ పై మనీందర్ స్వీయ దర్శకత్వంలో తెరెక్కిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.

దెయ్యాలను భయపెట్టే సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్ - ప్రభాస్

హారర్ కామెడీ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తుంది.సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ ను సాధిస్తున్నాయి.

హరీష్ శంకర్ మల్టీస్టారర్

దర్శకుడు హరీష్ శంకర్ డీజే దువ్వాడ జగన్నాథమ్ మూవీని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

విజయ్ దేవరకొండ తో మలయాళీ హీరోయిన్...

పెళ్లిచూపులు సినిమాతో సూపర్హిట్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ.

ఎన్టీఆర్ తో యెలేటి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు.కొత్త కాన్సెప్ట్ మూవీలకు ఓటేస్తున్నాడు.