ఆ నటుడికి గుడి కడుతున్నారు..

  • IndiaGlitz, [Saturday,July 18 2015]

సినిమా నటీనటులకు అభిమానుల నుండి వచ్చే మద్ధుతు చాలా బలాన్నిస్తుంది. అటువంటి అభిమాన గణాన్ని సంపాదించుకున్న నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన తన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ నటుడు అర్ధాంతరంగా అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశాడు.

విలక్షణ నటనతో ఆకట్టుకున్న శ్రీహరి స్థానాన్ని ఇతర నటులు పూర్తి చేస్తారనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. శ్రీహరి మరణించి ఏడాన్నర కాలం దాటింది. ఆయన గుర్తుగా ఆయన సతీమణి శాంతి శ్రీహరి మెయినాబాద్ లో ని ఫామ్ హౌస్ లో శ్రీహరికి ఆలయాన్ని నిర్మిస్తుందని సమాచారం.