ఏపీలో భగ్గుమంటున్న సూర్యుడు.. సీమలో 40కిపైనే ఉష్ణోగ్రత, రేపు కూడా వడగాడ్పులు

  • IndiaGlitz, [Tuesday,March 29 2022]

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. దీనికి తోడు ఉక్కపోత, చెమటలతో జనం అల్లాడుతున్నారు. అడుగుతీసి అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. రాత్రి 9 గంటలకు కూడా వేడి గాలులు నమోదవుతుండటంతో భరించలేకపోతున్నారు.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని అనేక చోట్ల 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా కోయిల కుంట్లలో 42.6 డిగ్రీలు, గురజాలలో 41.85, అనంతపురంలో 41.6, చిత్తూరులో 41.55, జమ్మలమడుగులో 41.4, కనిగిరిలో 41.2, తిరుపతిలో 40.2 డిగ్రీలు, విజయవాడలో 39.2, విశాఖలో 33.9, ఒంగోలులో 36.8, గుంటూరులో 37.4, నెల్లూరులో 39.7, కాకినాడలో 34, విజయనగరంలో 36.9, ఏలూరులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అటు ఏపీ పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి సహా మరో 13 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 14 , కృష్ణా జిల్లాలో 9 , కర్నూలు జిల్లాలో 9 , కడప జిల్లాలో 8 , శ్రీకాకుళం జిల్లాలో 5 , తూర్పు గోదావరి జిల్లాలో 1 మండలంలో వడగాడ్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.

More News

"ముఖచిత్రం" సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్, బర్త్ డే పోస్టర్ రిలీజ్

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం".

RRR రేంజ్ ప్రమోషన్ Pushpa కి చేసి ఉంటె !!

సినిమా తీసాక దానిపై జనానికి ఆసక్తి ఎలా తీసుకురావాలో తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి బాగా తెలుసు.

సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్‌ గదిలో వృద్ధుడి నరకయాతన

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు .

సురేష్ గోపీ న్యూలుక్.. ‘మీది గడ్డమా? మాస్కా?’ , రాజ్యసభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు

దేశ భవితను నిర్దేశించే చట్ట సభల్లో ఇటీవలి కాలంలో వాగ్వాదాలకు, పరస్పర ఆరోపణలకు, ముష్టి యుద్ధాలకు వేదికగా నిలుస్తోంది.

సెట్‌లో ‘వెల్‌కమ్ సాయితేజ్’ అంటూ ఫ్లకార్డ్స్.. కంటతడి పెట్టిన మెగా మేనల్లుడు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.