ఏపీలో భగ్గుమంటున్న సూర్యుడు.. సీమలో 40కిపైనే ఉష్ణోగ్రత, రేపు కూడా వడగాడ్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. దీనికి తోడు ఉక్కపోత, చెమటలతో జనం అల్లాడుతున్నారు. అడుగుతీసి అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. రాత్రి 9 గంటలకు కూడా వేడి గాలులు నమోదవుతుండటంతో భరించలేకపోతున్నారు.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని అనేక చోట్ల 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా కోయిల కుంట్లలో 42.6 డిగ్రీలు, గురజాలలో 41.85, అనంతపురంలో 41.6, చిత్తూరులో 41.55, జమ్మలమడుగులో 41.4, కనిగిరిలో 41.2, తిరుపతిలో 40.2 డిగ్రీలు, విజయవాడలో 39.2, విశాఖలో 33.9, ఒంగోలులో 36.8, గుంటూరులో 37.4, నెల్లూరులో 39.7, కాకినాడలో 34, విజయనగరంలో 36.9, ఏలూరులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అటు ఏపీ పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి సహా మరో 13 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 14 , కృష్ణా జిల్లాలో 9 , కర్నూలు జిల్లాలో 9 , కడప జిల్లాలో 8 , శ్రీకాకుళం జిల్లాలో 5 , తూర్పు గోదావరి జిల్లాలో 1 మండలంలో వడగాడ్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com