చికాగోలో తెలుగు విద్యార్ధిపై కాల్పులు.. హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌లో విషాద ఛాయలు
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాలో తెలుగు విద్యార్ధిపై అక్కడి నల్లజాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న కొప్పాల సాయిచరణ్‌పై అక్కడి నల్లజాతీయులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చరణ్‌ని హుటాహుటిన చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌లో నివాసం వుంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వీరు తమ కుమారుడి క్షేమ సమాచారం కోసం ఆందోళన చెందుతున్నారు. అతను కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తన కుమారుడిని క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలని తండ్రి శ్రీనివాసరావు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాడు.
చైనా కొత్త సంవత్సరం టార్గెట్‌గా కాల్పులు :
ఇకపోతే.. రెండ్రోజుల క్రితం అమెరికాలోని మాంటెరీ పార్క్‌లో ఓ వృద్ధుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో పది మంది దుర్మరణం పాలవ్వగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిందరినీ ఆసుపత్రిలో చేర్చగా.. కొందరి పరిస్ధితి ఆందోళనకరంగా వున్నట్లుగా తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్ నగరంలోని బాల్‌రూం డ్యాన్స్ క్లబ్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చైనా నూతన లునార్ సంవత్సర వేడుకల సందర్భంగా అక్కడ వేలాది మంది గుమిగూడారు. ఆ సమయంలోనే ఓ వృద్ధుడు మెషిన్ గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు.
నిందితుడు ఆత్మహత్య:
మరోవైపు.. ఈ మారణహోమానికి పాల్పడిన వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతుడిని 72 ఏళ్ల హూ కాన్ ట్రాన్ (72)గా గుర్తించారు. గతంలో అతను ట్రక్కు డ్రైవర్‌గా పనిచేయడంతో పాటు ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్‌సీ పేరుతో వ్యాపారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతను 2006లోనే భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు, ఘటనాస్థలికి సమీపంలోని సాన్ గాబ్రియేల్‌లో మృతుడు నివాసం వుంటున్నట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout