తమిళనాడు తెలుగు విలేకరి దారుణ హత్య
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. క్రిష్ణగిరి జిల్లా హోసూరులో చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన నాగరాజు విలగం అనే దిన పత్రికలో విలేకరిగా పని చేస్తున్నారు. ఆయన హోసూరులోని హనుమంతనగర్‌లో నివసిస్తున్నారు. నాగరాజు జర్నలిస్ట్‌గా పని చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే హిందూ మహా సభ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.
కాగా.. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో నాగరాజు మార్నింగ్ వాక్‌కు వెళ్లి తిరిగి వస్తుంగడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డగించారు. తమ వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. తప్పించుకునేందుకు యత్నించిన వెంబడించి మరీ అమానుషంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా.. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే నాగరాజు హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కొన్ని కథనాలను సైతం నాగరాజు తను పని చేసే పత్రికలో ప్రచురించినట్టు తెలుస్తోంది. అయితే.. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాపాయముందని రక్షణ కల్పించాలని నాగరాజు పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments