తమిళ టీ.విలో వ్యాఖ్యాతగా తెలుగు హీరో...

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

త‌మిళ టీ.వి లోవ్యాఖ్యాత‌గా తెలుగు హీరోనా..? ఎవ‌రా హీరో అనుకుంటున్నారా..? ద‌గ్గుబాటి రానా. లీడ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన రానా...ఆత‌ర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అయితే బాహుబ‌లి సినిమాలో రానా భ‌ల్లాల‌దేవ పాత్ర‌తో టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో సైతం పాపుల‌ర్ అయిపోయాడు.
ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, ఘాజి చిత్రాల్లో న‌టిస్తున్న రానా త‌మిళ టీ.వి లో ప్ర‌సారం అయ్యే ఓ ప్రొగ్రామ్ కి వ్యాఖ్యాత చేయ‌నుండ‌డం విశేషం. డిస్క‌వ‌రీ రియ‌ల్ హీరోస్ అనే ప్రొగ్రామ్ లో విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చిక్కుకున్న వారు ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌నేది చూపిస్తార‌ట‌. ఎంతో మంది స్పూర్తి క‌లిగించేలా ఈ ప్రొగ్రామ్ ని రూపొందించార‌ట‌. ఈ ప్రొగ్రామ్ మార్చి 1 నుంచి ప్రసారం కానుంది. అదీ సంగ‌తి.

More News

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని..

అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నాని.

పాటపాడనున్న హీరో

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో నారా రోహిత్.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనంకౌర్....

పలు తెలుగు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు బాయ్ ఫ్రెండ్ కరణ్ సింగ్ గ్రోవర్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

ఆ టైటిల్ కాదంటున్న మెగాహీరో..

సాయిధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు ‘సుప్రీమ్’సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఢిల్లీ లో బ్ర‌హ్మోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.