పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
పాకిస్తాన్లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రశాంత్ పని చేస్తుండేవాడు. 2017లో అతను సీజర్ లాండ్లో తన ప్రియురాలిని కలవడానికి వెళుతున్న క్రమంలో పాక్‌కు భద్రతా దళానికి ప్రశాంత్ చిక్కాడు. ఇంతకాలం పాక్‌లోనే ఉన్న ప్రశాంత్‌ను తాజాగా వాఘా సరిహద్దులో పాక్ అధికారులు భారత్‌కు అప్పజెప్పారు. ప్రశాంత్ విడుదలతో అతని కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలిశారు.
ఇదీ చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం
కాగా.. విశాఖకు చెందిన ప్రశాంత్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్పూర్లో పాక్ అధికారులకు చిక్కాడు. ప్రశాంత్‌తో పాటు మరో భారత యువకున్ని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్. అక్రమంగా పాక్‌లోకి చొరబడినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రశాంత్ సాప్ట్వేర్ ఇంజనీర్ కావడంతో భారత ప్రభుత్వమే అతడిని కుట్రపూరితంగా ప్రత్యేక ఆపరేషన్ కోసం తమ దేశంలోకి పంపించిందని అప్పట్లో పాక్ ఆరోపించింది.
కాగా.. పాక్ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్ వారి అనుమతితో తన తల్లిదండ్రులకు ఒక వీడియో మేసేజ్ పంపించాడు. ఆ వీడియో మెసేజ్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ‘‘నన్ను పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ సమస్యా లేదని నిర్ధారణ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాళ్లు ఇండియన్ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి వీలవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్ వాళ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఒక నెల వరకూ పడుతుంది.” అంటూ ప్రశాంత్ తన వీడియోలో వివరించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com