ప్రియురాలి చేతిలో మోసం.. కెనడాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

  • IndiaGlitz, [Sunday,November 15 2020]

కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ప్రేమించిన యువతి మోసం చేసిదనే బాధతో ప్రణయ్ అనే యువకుడు నెట్రోజన్ గ్యాస్‌ను పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్, సాయి అఖిల ప్రియ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అమెరికాలో సహజీవనం చేస్తున్నారు. అయితే ప్రణయ్.. పెళ్లి ప్రస్తావన తెచ్చే సరికి అఖిల ప్రియ అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది. దీంతో అఖిల ప్రియకు సంబంధించిన సంచలన విషయాలు ఓ వీడియో ద్వారా వెల్లడించి.. తన తల్లిదండ్రులకు ఒక లేఖను రాసి ప్రణయ్ మాత్రం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.

నాతో పాటు ఆరుగురిని మోసం చేసింది..

తన ప్రియురాలు తనతో పాటు ఆరుగురిని ప్రేమించిందని లేఖలో ప్రణయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆమెకు సిగిరెట్లు తాగే అలవాటుందని.. తనను కూడా తాగమని బలవంత పెట్టేదని తెలిపాడు. మద్యం కూడా సేవించేదని వద్దని వారించేందుకు యత్నించినా వినేది కాదని చెప్పాడు. మాజీ ప్రియుడితో నిత్యం టచ్‌లో ఉంటూ చాటింగ్ చేసేదని వెల్లడించాడు. తామిద్దరం కలిసి సహజీవనం చేశామని.. పెళ్లి ప్రపోజల్ తీసుకు రావడంతో తనని దూరం పెడుతూ వచ్చిందని.. ఆ తరువాత హెచ్ 1 వీసా రాగానే తనకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిందని ప్రణయ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

అవయవాలు దానం చేయండి.. బాడీ ల్యాబ్‌కి ఇవ్వండి..

తాను తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఎవరు బాధ పడవద్దని ప్రణయ్ లేఖలో తల్లిదండ్రులకు సూచించాడు. తన ప్రాణం పోయాక అవయవాలు దానం చేయాలని.. తన బాడీ కూడా మెడికల్ ల్యాబ్‌కు ఇచ్చేయాలని లేఖలో తల్లిదండ్రులకు తెలిపాడు. కుమారుడి చావు వార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు. తన కుమారుడు చావు ప్రపంచానికి తెలియాలని, తన కుమారుడిలా మరొకరెవరూ ఆత్మహత్య చేసుకోకూడదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

More News

కుటుంబంతో కలిసి ఆనందంగా దీపావళిని జరుపుకున్న రాజశేఖర్

హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

వేణు ఊడుగుల నిర్మాణంలో తెరకెక్కుతున్న చలం ‘మైదానం’

తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ నవలలో చలం రాసిన ‘మైదానం’ ఒకటి.

న‌వంబ‌ర్ 23నుండి 'సీటీమార్' షూటింగ్ పునః ప్రారంభం..

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌`.

'ఓదెల రైల్వేస్టేష‌న్'లో హెభా ప‌టేల్ లుక్ రిలీజ్‌‌

తెలంగాణలోని `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌నల‌ ఆధారంగా రూపొందుతోన్న‌ ‌డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’

ప్రజలకు బంపర్ ఆఫర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించింది. నేడు బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్‌తో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..