వాల్మీకి కోసం తెలుగమ్మాయి
Send us your feedback to audioarticles@vaarta.com
`వాల్మీకి` సినిమా గురించి ఈ మధ్య తరచూ అప్‌డేట్‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. బాబాయ్‌కు `గబ్బర్‌సింగ్`లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్... అబ్బాయి వరుణ్‌తేజ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, వరుణ్ కలిసి గతంతో `ముకుంద` అనే సినిమాకు పనిచేశారు.
ఈ సినిమాలో మరో నాయిక కూడా ఉంది. ఆ పాత్ర కోసం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కృష్ణ మంజూషను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. తెలుగు మాట్లాడే అమ్మాయిలను హరీష్ శంకర్ తరచూ ప్రోత్సహిస్తుంటారు. తాజాగా కృష్ణ మంజూషను కూడా అలాగే తీసుకున్నారని సమాచారం.
ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. తమిళంలో రిలీజ్ అయిన `జిగర్తండ` చిత్రానికి ఇది రీమేక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments