ఇప్పుడు తెలుగు చిత్రాల దండయాత్ర...

  • IndiaGlitz, [Tuesday,February 02 2016]

త‌మిళ హీరోల‌ను కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటారు. త‌మిళ హీరో సినిమా హిట్ అయితే సద‌రు హీరో సినిమాలు తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌లో విడుద‌ల‌య్యేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు హీరోలు త‌మిళ మార్కెట్‌పై క‌న్నేశారు. మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌లు త‌మిళ‌, మ‌ల‌యాళ మార్కెట్‌పై క‌న్నేశారు. అందుకే సినిమాల‌ను ఆయా రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబ‌లి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత తెలుగు చిత్రాలతో తెలుగు సినిమాల మార్కెట్ పెరిగాయి.

ఇప్పుడు మ‌హేష్ ఆగ‌డు చిత్రం పోకిరిపోలీస్‌గా విడుద‌లైంది. అలాగే ప్ర‌భాస్ రెబ‌ల్ చిత్రం వీర‌బ‌లి పేరుతో విడుద‌ల‌వుతుంది. అంతే కాకుండా రవితేజ‌, శృతిహాస‌న్‌, అంజ‌లి న‌టించిన బ‌లుపు చిత్రం కూడా ఎవ‌న్‌డా అనే పేరుతో తెలుగులో విడుద‌ల‌వుతుంది. ఒక‌ప్పుడు త‌మిళ చిత్రాలు తెలుగు డ‌బ్బింగ్ పేరుతో తెలుగు మార్కెట్‌పై దాడి చేశాయి. ఇప్పుడు తెలుగు చిత్రాలు కూడా అదేవిధంగా త‌మిళ ఇండ‌స్ట్రీని క్యాప్చ‌ర్ చేయ‌డానికి దండ‌యాత్ర మొద‌లు పెట్టాయి.