మీ భార్య బిడ్డల చెప్పులతోనే కొట్టిస్తా.. టాలీవుడ్ రచయిత సీరియస్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో ఒకరి పేరు చెప్పుకుని మోసాలు, దందాలు చేసే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి భూపాల్ ప్రతిభ గల రచయితగా దూసుకుపోతున్నారు. చందమామ, అలా మొదలయింది, నేనే రాజు నేనే మంత్రి, సీత లాంటి విజయవంతమైన చిత్రాలకు లక్ష్మి భూపాల్ రచయితగా పనిచేశారు.
తాజాగా లక్ష్మీ భూపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు తన వద్ద అసిస్టెంట్ రచయితలుగా పనిచేస్తున్నాము అని చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారనే వార్త తన వద్దకు వచ్చిందట. దీనిపై లక్ష్మి భూపాల్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనకు ఎవరూ అసిస్టెంట్స్ లేరని.. తన పేరు చెప్పి డబ్బులు అడిగేవారిని నమ్మవద్దని కోరారు.
నా దగ్గర కొందరు అసిస్టెంట్ రచయితగా పనిచేశారట. నా దగ్గరే నాకు తెలియకుండా అసిస్టెంట్ లు గా పనిచేసింది దెయ్యమో ఏమో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు నాకు ఎవ్వరూ అసిస్టెంట్స్ లేరు. ఈ విషయం ఇంతవరకు నా వద్దకు రాలేదు కాబట్టి నేను కూడా స్పందించలేదు.
నా దగ్గర పనిచేస్తున్నామని చెప్పి అడ్వాన్సులు తీసుకున్నారని కొందరు నన్ను అడిగారు. వాళ్ళ పని నచ్చితే డబ్బు ఇవ్వాలి కానీ నా పేరు చెబితే ఎలా ఇచ్చారు అని అడిగాను. అది మీ పై నమ్మకం అని అన్నారు. ఇది నాకు చాలా పెద్ద తిట్టులాగా అనిపించింది.
నేను సినిమాల్లో పాటలు రాసినా, మాటలు రాసినా కేవలం నా సొంత బుర్రని మాత్రమే ఉపయోగిస్తాను. దర్శక నిర్మాతలు కూడా నా బుర్రకు మాత్రమే డబ్బు ఇస్తారు. అంతే కానీ నాకు అసిస్టెంట్స్ లేరు అని లక్ష్మి భూపాల్ అన్నారు.
ఇక నా పేరు వాడుకుంటున్న దరిద్రులకు ప్రేమగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇకపై ఇలాంటి మోసాలకు, కక్కుర్తి పనులకు నా పేరు వాడితే.. మీ భార్య బిడ్డల చెప్పులతోనే కొట్టించి లైవ్ లో వేస్తా. దయచేసి ఎవ్వరూ ఇలాంటి వారిని నమ్మవద్దు. నాకెక్కడా బ్రాంచీలు లేవు అని లక్ష్మి భూపాల్ క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments