Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌పై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల్లో నటించి హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయింది. ఆమె గతంలో 'రక్షణ' అనే మూవీలో నటించారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్‌కి రమ్మని పిలుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే పాయల్ ఆరోపణలపై నిర్మాణ ప్రాణదీప్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్(TFPC)కి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై TFPC కీలక ప్రకటన విడుదల చేశారు.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. అగ్రిమెంట్ చేసుకున్న విధంగా కాకుండా ప్రమోషన్స్ విషయంలో సహకరించడం లేదని 'రక్షణ' సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించిన ప్రాణదీప్ ఠాకూర్ పేర్కొన్నారని తెలిపింది. ఈ సినిమాని ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమై పాయల్ రాజ్ పుత్‌ని ప్రమోషన్స్ చేయమని అడిగితే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయమని నిర్మాతకు సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా కోసం పాయల్ 50 రోజులు పని చేయాల్సి ఉందని.. కానీ నిర్మాత 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారని పేర్కొంది.
'అలాగే అగ్రిమెంట్ ప్రకారం 50 రోజులతో పాటు అన్ని రకాల సినిమా ప్రమోషన్స్‌కి పాయల్ హాజరు కావాల్సి ఉంటుంది. నిర్మాత ఇవ్వాల్సిన రూ.6లక్షలు పాయల్‌కి చెక్కు రూపంలో చెల్లించారు. సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషన్స్ పూర్తి చేస్తే ఆ చెక్ క్లియర్ చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే పాయల్ ప్రమోషన్స్‌కి రాకపోవడం వల్ల తాను చాలా నష్టపోయానని, సినిమాని విడుదల కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని నిర్మాతల మండలికి ప్రాణదీప్ ఫిర్యాదు చేశారు. పాయల్ ప్రియుడు సౌరబ్ డింగ్రా ఆమెకు మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
పాయల్ ప్రమోషన్‌లో పాల్గొంటే ఆమెకు రావాల్సిన రూ.6లక్షలు క్లియర్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాత చెప్పినా సరే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి తాను ప్రమోట్ చేయనని పాయల్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ఫిర్యాదుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి ఫార్వర్డ్ చేశాం. అయితే పాయల్ రాజ్‌పుత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదని చెప్పడంతో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెల రోజుల నుంచి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియాలో తన వైపు నుంచి ఏం తప్పే లేదు అన్నట్లు పాయల్ రాజ్‌పుత్ పోస్ట్ పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వివరించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాయల్ పేరు, ఫోటోలు వాడుకోవడంలో తప్పేమీ లేదని ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పష్టంచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout