కరోనాతో సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సెకండ్ వేవ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు.
57 ఏళ్ల సాయి బాలాజీ రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’ ‘హాలాహలం’ వంటి సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. మెగాస్టార్ హీరోగా నాగబాబు గారు అంజనా ప్రొడ్సక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘బావగారు బాగున్నారా’ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు కావడం గమనార్హం. సాయి బాలాజీ స్వస్థలం తిరుపతి. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖ లో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్‌కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments