కరోనాతో సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ మృతి

  • IndiaGlitz, [Monday,April 26 2021]

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సెకండ్ వేవ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు.

57 ఏళ్ల సాయి బాలాజీ రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’ ‘హాలాహలం’ వంటి సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. మెగాస్టార్ హీరోగా నాగబాబు గారు అంజనా ప్రొడ్సక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘బావగారు బాగున్నారా’ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు కావడం గమనార్హం. సాయి బాలాజీ స్వస్థలం తిరుపతి. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖ లో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్‌కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.

More News

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య - రాజశేఖర్, జీవిత దంపతులు

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే.

‘నో మ్యాడ్ ల్యాండ్’కు 3 ఆస్కార్ అవార్డులు.. సినిమా కథ ఏంటంటే..

సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు

అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సల్మాన్

స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది.

భారత్‌కు రూ.135 కోట్ల విరాళాన్ని ప్రకటించిన గూగుల్

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ విస్తరణ వేగం అధికంగా ఉండటంతో రోజుకు లక్షల్లో జనాభా కరోనా బారిన పడుతున్నారు.

కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం.. 82 మంది మృతి

కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రమాదాలు మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు జనాలు కోవిడ్ కారణంగా మరణిస్తూ ఉంటే.. మరోవైపు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.