ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా నారంగ్.. ఉపాధ్యక్షుడిగా దిల్‌రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన పాలకవర్గం ఖరారైంది. ప్రతి రెండేళ్లకోసారి ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఈసారి ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ నారంగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాస్, దిల్ రాజు, కొల్లి రామకృష్ణను నియమించారు. అలాగే కార్యదర్శులుగా దామోదప్రసాద్, ముత్యాల రమేష్ ఫిల్మ్ చాంబర్‌కు సేవలందించనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా ఆరుగురు సభ్యులను ఎన్నుకోగా.. కోశాధికారిగా మిర్యాలగూడ వెంకటేశ్వర థియేటర్ యజమాని విజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్ సెక్టార్‌కు ఏలూరు సురేందర్ రెడ్డి, డిస్టిబ్యూటర్ సెక్టార్‌కు ఎన్. వెంకట్ అభిషేక్, స్టూడియో సెక్టార్‌కు వై.సుప్రియ, ఎగ్జిబిటర్ సెక్టార్‌కు టీఎస్ రాంప్రసాద్ ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. వీరంతా 2021 వరకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పాలకవర్గ సభ్యులుగా పనిచేయనున్నారు.
సెక్టార్ కౌన్సిల్ మెంబర్స్‌గా...!
అభ్యర్థులకు పోలైన ఓట్లు ఇప్పుడు చూద్దాం..
01.. వైవీఎస్ చౌదరి : 454
02.. ప్రసన్న కుమార్ తుమ్మల : 453
03.. మోహన్ వడ్లపాట్ల : 439
04.. రామ సత్యనారాయణ : 428
05.. వై. సురేందర్ రెడ్డి : 377
06.. నట్టి కుమార్ : 364
07.. పల్లి కేశవ రావ్ : 362
08.. రాధా రాజేశ్వరి లక్కరాజు : 355
09.. శ్రీ వెంకటేశ్వర్లు : 342
10.. జేవీ మోహన్ గౌడ్ : 308
11.. మద్దినేని రమేశ్ బాబు : 307
12.. ఏవీవీ ప్రసాద రావ్ : 307
13.. చిట్టె నాగేశ్వరరావు : 295
14.. రామకృష్ణ వి : 288
15.. తోట రామకృష్ణ : 285
16.. వి. రమేశ్ బాబు : 279
17.. బెక్కం వేణుగోపాల్ : 277
18.. కె. సురేశ్ బాబు : 272
19.. శివలంకె క్రిష్ణ ప్రసాద్ : 265
20.. మురళీ బొడపాటి : 256 ఓట్లు పోలయ్యాయి.
ఈసీ మెంబర్స్‌గా ఎన్నికైన వారు.. వారు ఎన్నికైన ఓట్లు వరుసగా...
01.. వైవీఎస్ చౌదరి : 437
02.. ప్రసన్న కుమార్ తుమ్మల : 422
03.. మోహన్ వడ్లపాట్ల : 417
04.. టి. రామసత్యనారాయణ : 371
05.. ఎన్. పద్మిణి : 366
06.. వి. సాగర్: 361
07.. వి. వెంకట్రమణ రెడ్డి : 322
08.. పల్లి కేశవ రావ్ : 317
09.. నట్టి కుమార్ : 314
10.. జేవీ మోహన్ గౌడ్ : 274
11.. జె. పుల్లారావ్ : 273
12.. కేఎల్. దామోదర్ గౌడ్ : 267 ఓట్లు పోలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments