TFCC: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ .. ఎవరెవరికీ ఏ పదవులంటే..?

  • IndiaGlitz, [Monday,July 31 2023]

హోరాహోరీగా జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 48 ఓట్లలో 31 ఓట్లు దిల్‌రాజుకు పడటంతో ఆయన విజయం సాధించారు. ఇక ఫిలిం ఛాంబర్ ఎన్నికలు 14 రౌండ్లలో జరిగాయి. మొత్తం 891 ఓట్లకుగాను 563 ఓట్లు దిల్‌రాజుకు, సీ.కళ్యాణ్‌కు 497 ఓట్లు పడ్డాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మంది దిల్‌రాజు ప్యానెల్ నుంచి ఏడుగురు గెలిచారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానెల్. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరువర్గాలకు చెరో ఆరు దక్కాయి. చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీతో సీ . కళ్యాణ్.. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు తెలుగు చిత్ర పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు బరిలో నిలిచారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ :

ప్రెసిడెంట్ : వీ. వెంకట రమణా రెడ్డి (దిల్‌రాజు)
వైస్ ప్రెసిడెంట్స్ : ముత్యాల రామదాస్, పీ శ్రీనివాసరావు, కొల్లి రామకృష్ణ
గౌరవ కార్యదర్శులు : కేఎల్ దామోదర ప్రసాద్, కే . శివప్రసాద రావు
గౌరవ జాయింట్ కార్యదర్శులు : మోహన్ వడపట్ల, సీ .భరత్ చౌదరి, డీఎస్ఎన్ ప్రసాద్ (మోడల్ శివ), మాదాల రామకృష్ణ, పేర్ల సాంబమూర్తి

గౌరవ కోశాధికారి : తుమ్ముల ప్రసన్న కుమార్

సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్లు :

ప్రొడ్యూసర్ సెక్టార్ : శివలెంక కృష్ణ ప్రసాద్
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ : ఎం . సుధాకర్
ఎగ్జిబిటర్ సెక్టార్ : టీఎస్ రామప్రసాద్
స్టూడియో సెక్టార్ : ఈవీఎన్ చారి

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు :

1. వైవీఎస్ చౌదరి
2. సీ . కళ్యాణ్
3. జేవీ మోహన్ గౌడ్
4. కే. అశోక్ కుమార్
5. వై రవి శంకర్ (మైత్రీ రవి)
6. ఎన్. పద్మిని
7. కే. అమ్మీరాజు
8. పీవీ రవికిశోర్ (స్రవంతి రవి కిషోర్)
9. ముత్యాల రమేష్
10. పీ . భరత్ భూషణ్
11. ఏ. సత్యనారాయణ (అనుశ్రీ)
12. బీ. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
13. ఎన్. నాగార్జున
14. ఎం. వెంకటేశ్వర రావు (శాంతి)
15. ఎన్. వెంకట్ అభిషేక్ (అభిషేక్ నామా)
16. బీ. బాపిరాజు
17. వై. సుప్రియ
18. టీ.సాయి చరణ్ రెడ్డి
19. సయ్యద్ తాహీర్ అలీ
20. బీ. అంజి రెడ్డి
21. టీ. బాలా గోవింద్ రాజ్
22 . జీ. మహేశ్వర రెడ్డి (సాయి)
23. టీ. నారాయణ ప్రసాద్
24. జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్
25. బీ. రాజేశ్వర రెడ్డి
26. పీ. సీతారామ్ కుమార్
27. ముత్తవరపు శ్రీనివాస బాబు
28. ఎం. తిమ్మప్ప
29. ఏవీ. అంబికా ప్రసాద్
30. కే.వంశీ కిశోర్
31. జీ. వీర నారాయణ బాబు
32. ఎం. విజేందర్ రెడ్డి