షూటింగ్‌లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున సినిమా షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 1 వ తేదీ వరకూ షూటింగ్‌లకు ఒక్కొక్క ప్రొడక్షన్ యూనిట్‌కు 50 మంది మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ నిర్వహించాలని తెలిపింది. అలాగే 1 వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలుంటాయని వెల్లడించింది.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందడం మూలంగా.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతలకు తెలియజేయునది ఏమనగా.. అత్యవసర సినిమా షూటింగ్‌లకు ఒక్కొక్క ప్రొడక్షన్ యూనిట్‌కు 50 మంది మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటూ, ఆ షూటింగ్ ప్రాంతాలలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూ.. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ.. షూటింగ్స్ చేసుకుంటూ అలాగే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ విధానాన్ని 01-05-2021 వరకూ పాటించాలని ఆ తదుపరి అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయాలను తెలియజేయడం జరుగుతుంది’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout