షూటింగ్‌లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంక్షలు

  • IndiaGlitz, [Tuesday,April 20 2021]

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున సినిమా షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 1 వ తేదీ వరకూ షూటింగ్‌లకు ఒక్కొక్క ప్రొడక్షన్ యూనిట్‌కు 50 మంది మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ నిర్వహించాలని తెలిపింది. అలాగే 1 వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలుంటాయని వెల్లడించింది.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందడం మూలంగా.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతలకు తెలియజేయునది ఏమనగా.. అత్యవసర సినిమా షూటింగ్‌లకు ఒక్కొక్క ప్రొడక్షన్ యూనిట్‌కు 50 మంది మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటూ, ఆ షూటింగ్ ప్రాంతాలలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూ.. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ.. షూటింగ్స్ చేసుకుంటూ అలాగే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ విధానాన్ని 01-05-2021 వరకూ పాటించాలని ఆ తదుపరి అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయాలను తెలియజేయడం జరుగుతుంది’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.

More News

సినీ పరిశ్రమ, జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు.

4 రాష్ట్రాల సీఎంలు సహా కరోనాకు చిక్కిన బడా నేతలు

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది.

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్..

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్ కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న క్రమంలో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

‘పింక్ వాట్సాప్’తో జాగ్రత్త..

ఇంటర్నెట్ బాగా డెవలప్ అయ్యాక.. ప్రజానీకానికి పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాక ఏం చేయాలన్నా ఒక్క క్షణం ఆలోచించి చేయాల్సిందే.

వేగంగా వస్తున్న ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ చిన్నారిని కాపాడిన పాయింట్స్ మ్యాన్..

కొన్ని స్టంట్స్ సినిమాల్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అది జస్ట్ మూవీ కోసం.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తేనే చూస్తున్న మనకు వెన్నుముక నిటారుగా అయిపోయి..