TFCC:తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు మోగిన నగారా : బరిలో దిల్‌రాజు, సి కళ్యాణ్ .. పోటీ నువ్వా నేనా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. జూలై 30న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనుండగా.. 14వ తేదీ నామినేషన్స్‌కు , 21కి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. బడా నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్‌రాజ్‌లు అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని సమాచారం . ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా బసిరెడ్డి వున్నారు.
అయితే దిల్‌రాజు, కళ్యాణ్‌లతో పాటు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. సి. కళ్యాణ్ గతంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇక దిల్‌రాజ్ టాలీవుడ్ అగ్ర నిర్మాతగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వీరిద్దరూ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీపడుతూ వుండటంతో నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ వుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
వీరిద్దరి కారణంగా టాలీవుడ్ మరోసారి రెండుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో దిల్‌రాజు గెలిస్తే ఇండస్ట్రీలోని కీలక బాడీలన్నింటినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ టేకోవర్ చేసి పరిశ్రమను తన చెప్పుచేతల్లో వుంచుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు గతంలో ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏ ఎన్నికలు జరిగినా నటీనటులు రోడ్డెక్కి కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాలు ఏ స్థాయిలో కొట్టుకున్నాయో తెలిసిందే. ఇరు వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి ప్రెస్ మీట్లు పెట్టి చిత్ర పరిశ్రమ పరువును బజారుకీడ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments