కన్న‌డ‌లోకి తెలుగు డైరెక్ట‌ర్‌

  • IndiaGlitz, [Saturday,November 24 2018]

తెలుగులో నితిన్‌తో 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' సినిమా చేసిన డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండ‌.. త‌ర్వాత చైత‌న్య‌తో 'ఒక లైలా కోసం' సినిమా చేశాడు. 'ఒక లైలా కోసం' పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. దాంతో విజ‌య్ కుమార్‌కు అవకాశాలు రాలేదు. చేసిన ఒక‌ట్రెండు ప్ర‌య‌త్నాలు కూడా ఆగిపోయాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ యువ ద‌ర్శ‌కుడు క‌న్న‌డ‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడ‌ట‌.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడైన నిఖిల్‌కుమార్ గౌడ 'జాగ్వార్' సినిమాతో తెలుగు, క‌న్న‌డలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యువ హీరోతో విజ‌య్‌కుమార్ కొండ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. డిసెంబ‌ర్ 16న అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. కుమార‌స్వామి త‌న నిర్మాణ సంస్థ‌లో ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.