TDP:శవ రాజకీయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. టీడీపీ కూటమి నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే తమ ఉనికికే ప్రమాదం అని భావిస్తున్నారు. దీంతో శవరాజకీయాలకు తెరదీశారు. రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగినా దానికి వైసీపీ నేతలే బాధ్యులని ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రచారరథం తగిలి ఓ పదేళ్ల బాలుడికి ప్రమాదం జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ప్రచార రథం డ్రైవర్ స్వయంగా ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.తలే రాజేష్ ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి.. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ ఈ ఘటనను కూడా తెలుగుదేశం పార్టీ సిగ్గులేకుండా రాజకీయం చేయడం ప్రారంభించింది. టీడీపీకి నిజంగా మంచి చేసే బుద్ధి ఉంటే రాజకీయం చేయకుండా వెళ్లి ఆ బాలుడి కుటుంబానికి భరోసా కల్పించాలే గానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం నీచాతి నీచం అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం వైసీపీపై బురదజల్లుతూ మానసిక ఆనందం పొందుతోందని మండిపడుతున్నారు.
ఇదే సమయంలో గురువారం రాత్రి తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలను దుర్బాషలాడటంతో పాటు ద్విచక్ర వాహనాలతో వారిని ఢీకొట్టారు. ఈ దాడిలో మొత్తం ముగ్గురు గాయపడినట్లు సమాచారం. వారిలో వైసీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో వచ్చిన టీడీపీ శ్రేణులు లోకేశ్ విజయం సాధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని సమాచారం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు. అయినా కానీ ఇంతవరకు మంగళగిరి టీడీపీ అభ్యర్ధి లోకేష్ ఆయన కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. పొరపాటున ఆయనకు ఏదైనా జరిగితే.. లోకేష్ బాధ్యతా వహిస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడు లోకేష్ ఓడిపోతారనే భయంతోనే టీడీపీ నేతలు ఇటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments