TDP: ఇచ్చట పోటీకి అభ్యర్థులు కావలెను.. దారుణ పరిస్థితుల్లో టీడీపీ..

  • IndiaGlitz, [Monday,January 08 2024]

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ మాత్రం ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉంది. కానీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంపీ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించింది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా గ్రౌండ్ లెవల్‌లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. పచ్చ మీడియా ఎంత లేపాలని చూసినా ప్రయోజనం మాత్రం శూన్యంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తలో దారిలో ఉన్నారు.

తలోదారిలో సిట్టింగ్ ఎంపీలు..

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అటు ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట. దీంతో సిట్టింగ్ ఎంపీలే పార్టీ తరపున పోటీకి నిరాకరిస్తుంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదు.

పోటీకి ఆసక్తి చూపని నేతలు..

అసలే పోటీకి అభ్యర్థులు దొరకడం కష్టమైతే దొరికిన వారికి చంద్రబాబు పెట్టే టార్గెట్లు మింగుడు పడటం లేదట. అందుకే సైకిల్ గుర్తుపై లోక్‌సభకు పోటీ చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. రాయలసీమలో తిరుపతి ఎంపీగా పోటీలో ఉండే శివప్రసాద్ మరణంతో ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి దొరకలేదు. అలాగే చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు ఎంపీకి కూడా అభ్యర్థి దొరకని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈసారి పోటీకి ఆసక్తి కనబరచడం లేదు.

అభ్యర్థులే దొరకడం లేదు..

ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు. బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు. ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. గతంలో కంటే ఈసారి టీడీపీ పరిస్థితి మరింత దిజరాడంతో పార్టీలో నాయకులు ఎవరూ ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబు ఆశలు ఫలించేలా కనపడటం లేదు. దీంతో గత ఎన్నికల్లో కనీసం మూడు ఎంపీ సీట్లైనా దక్కించుకోగా.. ఈసారి ఒక్క ఎంపీ సీటు దక్కేలా పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

More News

Telangana BJP: లోక్‌సభ ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక కసరత్తు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తహతహలాడుతున్న కమలనాథులు

Bandla Ganesh: హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

టాలీవుడ్ అగ్ర నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో గణేశ్ మాట్లాడుతూ

Devara:'దేవర' గ్లింప్స్ వచ్చేసిందిగా.. ఎన్టీఆర్ నటన అరాచకం అంతే..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'. ఇప్పటికే విడుదలైన పోసర్లు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగా..

Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు షాక్.. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 11 మంది నిందితులకు తిరిగి జైలు శిక్ష విధిస్తూ

బ్రేకింగ్: కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా

విజయవాడ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే బెజవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesinenei Nani) ప్రకటించిన సంగతి తెలిసిందే.