TDP Fake Survey: సీఎం జగన్ దూకుడుతో కదులుతున్న తెలుగుదేశం పునాదులు.. ఫేక్ సర్వేలకు దిగుతున్న పచ్చ మీడియా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఎవర్ని అడిగినా చెబుతారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అవినీతి చేసి జైలులో మగ్గుతున్నారు. దీంతో ఆ పార్టీని నడిపే నాయకుడు లేక సతమతమవుతోంది. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో జనంలోకి చొచ్చుకుపోవడంతో టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయి. దీంతో ఆ పార్టీ ఇక పెట్టే బేడా సర్దుకోవడమే మిగిలిపోయింది. మరోవైపు టైమ్స్ నౌ, ఇతర సర్వేల్లో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని దాదాపు 50 శాతం ఓట్లతో 24-25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని తేలింది. అలాగే పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా, టీడీపీ- జనసేన కూటమి కలిపి 41 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని వెల్లడైంది. దీంతో టీడీపీ-జనసేన కలిసి వచ్చినా జగన్ ప్రభంజనం ముందు కనీసం నిలిచే అవకాశం కూడా లేదని సర్వేల్లో తేలిపోయింది. ఈ సర్వేలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిస్తేజంలో మునిగిపోయింది.
క్యాడర్‌లో జోష్ నింపేందుకు సొంత సర్వేలు..
దీంతో చేసేదేమి లేక క్యాడర్‌లో జోష్ నింపేందుకు సొంత సర్వేలు చేయించింది. అందులో భాగంగా India TV -CNX పేరిట విడుదలైన ఈ సర్వేలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 46శాతం ఓట్లతో 15 లోక్‌సభ స్థానాలు.. తెలుగుదేశానికి 42శాతం ఓట్లతో 10 ఎంపీ స్థానాలు వస్తాయని తేలినట్లు టీడీపీ చెప్పుకుంటోంది. అంతేకాకుండా 2019లో మూడే ఎంపీ స్థానాలతో ఉన్న తాము ఇప్పుడు మరో ఏడు సీట్లు అదనంగా గెలుచుకుని 10 లోక్‌సభ సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని జబ్బలు చర్చుకుంటున్నారు టీడీపీ నేతలు.
సీఎం జగన్ దూకుడు ముందు నిలిచే ధైర్యం లేక..
ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో తెలుగుదేశానికి దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జిలే లేరు. ఇక ఎంపీ టికెట్ అయితే అడిగేవారే లేరు. సీఎం వైయస్ జగన్ దూకుడు ముందు నిలిచే ధైర్యం లేక పోటీకి ససేమిరా అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీకి పది ఎంపీ సీట్లు ఎలా వస్తాయని. .ఈ సర్వే మొత్తం భూటమకమని తేలిపోయింది. కేవలం కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం నింపేందుకే ఈ సర్వే సొంతంగా విడుదల చేశారు తప్ప అందులో వాస్తవం లేదని తెలుగు తమ్ముళ్లే అంగీకరిస్తున్నారు.
ఫేక్ సర్వేలతో ప్రజలను ఏమారుస్తున్న తెలుగుదేశం మీడియా..
ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయి, ఇచ్చిన మాట, చేసిన హామీలను గాలికి వదిలేసే పార్టీగా ప్రజల్లో చీదరింపునకు గురైన తెలుగుదేశానికి కార్యకర్తలు సైతం మెల్లగా దూరం అవుతున్నారు. దీంతో చంద్రబాబు, ఆయన వందమాదిగలు ఎప్పటి మాదిరి గానే సొంత మీడియాలో భారీగా ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే సర్వేలను సైతం తారుమారు చేసేస్తూ సొంత సర్వేలను ప్రకటించుకుని ప్రజలను ఏమారుస్తున్నారు. ఈ భూటకపు సర్వేల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments