Telugu Comedian:దర్శకుడిగా మారబోతున్న మరో తెలుగు కమెడియన్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో మరో కమెడియన్ దర్శకుడుగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో పాటు జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు.. బలంగా మూవీతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. ప్రియదర్శి, కావ్య నటించిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా దేశవిదేశాల్లో పలు అవార్డులు కూడా సాధించింది. చావు నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ మూవీ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. విడిపోయిన చాలా మంది కుటుంబసభ్యులు ఈ చిత్రం చూసి మళ్లీ ఒక్కటైన సంఘటనలు కూడా జరిగాయి. అంతలా ప్రజలపై బలగం మూవీ ప్రభావం చూపింది. ఈ చిత్రంతో వేణు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక మరిన్ని క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకున్నాడు.
సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మూవీ..
ఇప్పుడు వేణు బాటలోనే జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్ కూడా ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రాలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం లాంఛ్ ఈవెంట్ జరగబోతుందట. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించబోతున్నారని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన విమానం చిత్రంలో సముద్రఖని, ధన్ రాజ్ కలిసి నటించారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో సముద్రఖనికి ధన్ రాజ్ చెప్పిన కథ బాగా నచ్చిందట. దీంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి వేణు బాటలోనే ధన్ రాజ్ కూడా నడవనున్నాడు. బలగం మూవీతో వేణు గ్రాండ్ సక్సెస్ అందుకోగా.. ధన్ రాజ్ కూడా మంచి విజయం సాధించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
జగడం చిత్రం ద్వారా సినిమాల్లోకి అరంగేట్రం..
పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన 'జగడం' చిత్రం ద్వారా ధన్ రాజ్ చిత్రపరిశ్రమకు కమెడియన్‌గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పరుగు, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్, రాజు గారి గది, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత 2013లో మొదలైన జబర్దస్త్ షోలో నటించి మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను కూడా నిర్మించాడు. ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments