తెలుగు »
Cinema News »
'కురుక్షేత్రం' తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది - యాక్షన్ కింగ్ అర్జున్
'కురుక్షేత్రం' తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది - యాక్షన్ కింగ్ అర్జున్
Sunday, June 25, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 36 ఏళ్ళ సినీ కెరీర్లో అరుదుగా తక్కువ మంది మాత్రమే చేరుకోగల శిఖరాన్ని చేరుకున్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన యాక్షన్ కింగ్ అరు్జన్ నటించిన 150వ చిత్రం `కురుక్షేత్రం`. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ విడుదలవుతోన్న ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రాన్ని అరుల్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
పోలీస్ ఆఫీసర్ల జీవితాల్లో మరో కోణం..స్క్రీన్‌ప్లే హైలెట్
యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ - ``సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి 36 సంవత్సరాలవుతుంది. `కురుక్షేత్రం` నా 150వ సినిమా. 'జైహింద్ 2' తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రారంభంలో ఇది నాకు 150వ చిత్రమని తెలియదు. తర్వాత షూటింగ్ టైంలో తెలిసింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్. బిజీ కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ముందు ఈ సినిమా చేయకూడదనే అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నచ్చడంతో చేశాను. నేను ఇప్పటి వరకు 20-30 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. కానీ ఆ సినిమాలో లేని ఎలిమెంట్స్ `కురుక్షేత్రం` సినిమాలో చూస్తారు. ప్రతి పోలీస్ ఆఫీసర్ జీవితంలో మరో కోణం ఉంటుందని తెలియజేసే సినిమా ఇది. తెలుగు, తమిళం, కన్నడంలో సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుంది. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ, నవీన్ సంగీతం సినిమాకు ప్లస్ అవుతాయి. మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేశాను. ఈ సినిమాలో ప్రసన్న చాలా కీలక పాత్ర చేశాడు. మంచి డేడికేషన్ ఉన్న నటుడు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీ రోల్ చేసింది. నిర్మాతలు వ్యాపార దృష్టితో కాకుండా సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. డిఫరెంట్‌గా ఉండటమే కాదు. నాకు, తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.
అర్జున్‌గారి 150వ సినిమాలో నటించడం ఓ గౌరవం
నటుడు ప్రసన్న మాట్లాడుతూ - ``అర్జున్‌గారు గొప్పనటుడే కాదు. అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచే వ్యక్తి. ఆయన కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిలింగా నటించిన 150 చిత్రంలో నేను నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఇక దర్శకుడు అరుణ్‌తో మంచి అనుబంధం ఉంది. తను డైరెక్టర్‌గా చేసిన సినిమాలోనే స్నేహతో పరిచయమైంది. ఆ ప్రేమ పెళ్ళి వరకు కొనసాగింది. నేను కూడా బివిఎస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. అలాగే నిర్మాతలు మంచి ప్యాషన్‌తో సినిమాన నిర్మించారు. వారు భవిష్యత్‌తో తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. `కురుక్షేత్రం సినిమా తప్పకుండా అందరినీ మెప్పించే చిత్రమవుతుంది'' అన్నారు.
నమ్మకంగా ఉన్నాం
దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ - ''ప్యాషనేట్ స్టూడియోస్‌పై నిర్మాతలు చేసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు.
మెప్పించే సినిమా
నిర్మాతల్లో ఒకరైన ఉమేష్ మాట్లాడుతూ - ''దర్శకుడు అరుణ్‌గారు యు.ఎస్ నుండి మంచి స్క్రిప్ట్‌తో వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అందరికీ రీచ్ కావాలంటే మంచి హీరో కావాలనుకోగానే మాకు అర్జున్‌గారైతే తప్పకుండా న్యాయం చేస్తారనిపించింది. ఇన్వెస్టిగేషన్తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ అన్ని ఉన్న సినిమాగా మెప్పిస్తుంది'' అన్నారు.
అరుల్ మాట్లాడుతూ - ''అర్జున్‌గారి 150వ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అరుణ్ వైద్యనాథన్గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం : సాయిగీతా ఫిలిమ్స్, దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments