close
Choose your channels

తెలుగు ప్రేక్షకులు మరో చరిత్రతో డోర్ ఓపెన్ చేశారు.. చీకటిరాజ్యం సక్సెస్ తో ప్రయోగాల డోర్ తెరిచారు - కమల్ హాసన్

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`మ‌రో చ‌రిత్ర` వంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకున్నారు క‌మ‌ల్‌హాస‌న్‌. సాగ‌ర‌సంగ‌మం, స్వాతిముత్యం, శుభ సంక‌ల్పం వంటి సినిమాలతో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేశారు. ఇటీవ‌లే విశ్వ‌రూపం, ఉత్త‌మ విల‌న్ వంటి సినిమాల‌తో చ‌క్క‌ని విజ‌యాలు అందుకున్నారు. యూనివ‌ర్శ‌ల్ హీరోగా క‌మ‌ల్ వ‌ర‌ల్డ్‌వైడ్ స్టార్‌డ‌మ్ సంపాదించుకున్న‌ క‌మ‌ల్‌హాస‌న్ చాలా గ్యాప్ త‌ర్వాత నేరుగా తెలుగులో న‌టించిన `చీక‌టిరాజ్యం` చిత్రంతో కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ఇదో డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది.

విశ్వనటుడు, లోకనాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజేష్‌.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ - శ్రీ గోకుళం మూవీస్‌ సంయుక్తంగా నిర్మించిన 'చీకటిరాజ్యం' న‌వంబ‌ర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజై భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. మొద‌టి రోజు ఈ సినిమా ఏకంగా ఏపీ, తెలంగాణ‌లో 1 కోటి 40 ల‌క్ష‌ల గ్రాస్ (86 ల‌క్ష‌ల షేర్‌) వ‌సూళ్లు సాధించింది. ఈ ఆదివారం నుంచి మ‌రో 25 -30 థియేట‌ర్ల‌ను పెంచ‌నున్నారు. ఈ విజ‌యం మ‌రో 10 ప్ర‌యోగాత్మ‌క సినిమాల్లో న‌టించేందుకు ఉతం ఇచ్చింద‌ని చెబుతున్నారు క‌మ‌ల్‌హాస‌న్. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ స్టార్ హోట‌ల్‌లో జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌హా మేటి న‌టి అక్కినేని అమ‌ల‌, `చీక‌టిరాజ్యం` ద‌ర్శ‌కుడు రాజేష్ ఎం సెల్వ‌, క‌థానాయిక‌ మ‌ధుశాలిని, ర‌చ‌యిత అబ్బూరి ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌క్సెస్ మీట్‌లో యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ మాట్లాడుతూ -``చీక‌టిరాజ్యం చాలా డిఫ‌రెంట్ ఫిలిం. ఇలాంటి సినిమాలు న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ తీయాల‌ని అనిపించ‌దు. న‌చ్చితే మ‌రెన్నో ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేయాల‌ని అనిపిస్తుంది. వెంట వెంట‌నే డిఫ‌రెంట్ మూవీస్ తీసేందుకు స్కోప్ పెరుగుతుంది. తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోచ‌రిత్ర అనే చిత్రంతో డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు చీక‌టిరాజ్యం స‌క్సెస్‌తో ప్ర‌యోగాలు చేసేందుకు డోర్ ఓపెన్ చేశారు. తెలుగువారి నుంచి ఇంత మంచి ఆద‌ర‌ణ ద‌క్కినందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రంలో జిబ్రాన్ సంగీతం బావుంద‌ని అన్నారు. నేరుగా ఇలా స‌క్సెస్‌మీట్‌లో చీక‌టిరాజ్యం పంపిణీదారులు వ‌చ్చి స‌క్సెస్ గురించి చెబుతుంటే చెవికి ఇంపుగా మ్యూజిక్‌లా ఉంది. జిబ్రాన్ మ్యూజిక్ కంటే ఈ మాట చాలా బావుంది. అంతేకాదు .. ఈ స‌క్సెస్ మీట్‌కి అమ‌ల గారు రావ‌డానికి కార‌ణం ఉంది. త‌ను నా సినిమాలో అతిధి పాత్ర‌లో న‌టిస్తున్నారు. అమ్మ నాన్న ఆట .. అనేది టైటిల్‌. త్వ‌ర‌లోనే సెట్స్‌కెళ్ల‌నుంది`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు రాజేష్‌ సెల్వ మాట్లాడుతూ -``ఇది క‌మ‌ల్ స‌ర్ విక్ట‌రీ. టీమ్ సాధించిన విక్ట‌రీ. నా ఏడేళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. చీక‌టిరాజ్యం పంపిణీదారుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. క‌మ‌ల్ స‌ర్ ద‌గ్గ‌ర ఎంతో కాలంగా ప్రొడ‌క్ష‌న్ ప‌నులు నేర్చుకున్నా. తొలిసారి ద‌ర్శ‌కుడిగా చేసిన ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చినందుకు క‌మ‌ల్ స‌ర్‌కి థాంక్స్‌`` అన్నారు.

పంపిణీదారుడు మ‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ -``ఈ సినిమాని తెలంగాణ‌లో పంపిణీ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు క‌మ‌ల్‌హాస‌న్‌గారికి చాలా కృత‌జ్ఞ‌త‌లు. 15ఏళ్ల త‌ర్వాత ఆయ‌న తెలుగులో నేరుగా సినిమా చేశారు. ఇది చ‌క్క‌ని ఓపెనింగ్స్‌తో మంచి విజ‌యం సాధించింది. ఏపీ, తెలంగాణ‌లో 230 థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఫ‌స్ట్ డే 1కోటి 40 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. రెండో రోజునుంచి మ‌రింత‌గా వ‌సూళ్లు పెరిగాయి. అందుకే ఈ ఆదివారం నుంచి మ‌రో 30 థియేట‌ర్ల‌ను అద‌నంగా పెంచుతున్నాం. తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాల్ని ఆద‌రిస్తార‌న‌డానికి చీక‌టిరాజ్యం విజ‌య‌మే ఓ చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. టీమ్‌కి కంగ్రాట్స్‌`` అన్నారు.

మేటి న‌టి, బ్లూక్రాస్ అధ్య‌క్షురాలు అక్కినేని అమ‌ల మాట్ల‌డుతూ -`` తెలుగు సినిమాకి ఓ డిఫ‌రెంట్ ఎటెంప్ట్ ఇది. బ్యూటిఫుల్ స్లిక్ థ్రిల్ల‌ర్‌. స్ట‌యిలిష్‌గా ఉంది. క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న అద్భుతం. ఆడియెన్స్ ఇలాంటి చిత్రాల్ని ఆద‌రిస్తున్నారు కాబ‌ట్టి మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయి`` అన్నారు.

ర‌చ‌యిత అబ్బూరి ర‌వి మాట్లాడుతూ -``అనుకున్న సినిమాని అనుకున్న‌ట్టే తీయ‌డం క‌మ‌ల్‌హాస‌న్ గారి ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న సినిమా అంటే కొత్త‌ద‌నం ఆశిస్తారు. వైవిధ్యంతో పాటు, గ్రిప్పింగ్ క‌థ‌నంతో న‌డిపించ‌డం వ‌ల్లే చీక‌టిరాజ్యం ఇంత పెద్ద స‌క్సెస్ సాధించింది. ఈ సినిమాకి రాసే అవ‌కాశం ఇచ్చిన క‌మ‌ల్ హాస‌న్ గారికి థాంక్స్‌`` అన్నారు.

మ‌ధుశాలిని మాట్లాడుతూ - ఎన్నో సినిమాల్లో న‌టించినా ఈసినిమా నా కెరీర్‌లో వెరీ స్పెష‌ల్‌. మైల్ స్టోన్ సినిమా ఇది. అభిమానుల నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లొస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నార‌.
===========

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా, అక్కినేని అమ‌ల అతిధి పాత్ర‌లో `అమ్మా నాన్న ఆట‌`

ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నక‌మల్ హాస‌న్ లేటెస్టుగా `చీక‌టిరాజ్యం` సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నేరుగా మ‌రో తెలుగు సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ `అమ్మా నాన్న ఆట‌`. నాటి మేటి న‌టి అక్కినేని అమ‌ల ఈ చిత్రంలో అతిధి పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని, అమ్మా నాన్న ఆట అనే టైటిల్ నిర్ణ‌యించామ‌ని క‌మ‌ల్‌హాస‌న్ `చీక‌టిరాజ్యం` స‌క్సెస్‌మీట్‌లో అధికారికంగా ప్ర‌క‌టించారు. కొత్త ప్రాజెక్టు గురించి

యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ మాట్లాడుతూ -``టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఇదో ఫ్యామిలీ డ్రామా. రొమాన్స్‌, హాస్యం ఆక‌ట్టుకుంటాయి. ఈ చిత్రంలో అమ‌ల గారు అతిధిగా న‌టిస్తున్నారు. త‌న‌తో చాలా కాలానికి క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. నాటి రోజుల్లో మేం ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో జోడీగా న‌టించాం. ఇంత‌కాలానికి మ‌రో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందు క‌నిపించ‌బోతున్నాం. నా స్నేహితుడు, మ‌ల‌యాళంలో ఫేమ‌స్ డైరెక్ట‌ర్ రాజీవ్ కుమార్ (చాణ‌క్య ఫేం)ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌రీనా వ‌హ‌బ్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌రో యంగ్ హీరోయిన్ న‌టించ‌నుంది. ఈ సినిమాలో నేను ఎవ‌రితో రొమాన్స్ చేస్తాను అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌`` అంటూ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment