తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ - తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్

  • IndiaGlitz, [Monday,March 20 2017]

తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌- తెలంగాణ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్తంగా గుర్తింపు లేని కొన్ని సంస్థల యాక్టివీటీస్‌ గురించి సోమరవారం ఉదయం హైదరాబాద్‌ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ..
తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు సి.కల్యాణ్‌ మాట్లాడుతూ... ''రెండు రాష్ట్రాలు ఒకే భాషతో వ్యాపారం జరిగేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కనూా్యజన్స్‌ కూడా ఏర్పడ్డాయి. అందువల్ల ఇండస్ట్రీకి వచ్చేకొత్త మెంబర్స్‌ ఇబ్బందులు పడుతున్నారు. దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అందుకే ఈ సమావేశం ఏర్పారటు చేశాం. 1941లో 'ది హైదరాబాద్‌ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' ప్రధమంగా తెలుగులో ఏర్పాటు చేశారు . దీన్నీ 2009లో 'ద తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌'గా మార్పు చేశారు. తర్వాత 2014లో 'తెలంగాణ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌'గా మార్చి అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం గుర్తింపుతో.. 'సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఛాంబర్‌ అఫ్లియేటెడ్‌'బాడీగా.. సెంట్రల్‌ గవర్నమెంట్‌ గుర్తించిన 'ఫిలిం పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా'కు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. 1951లో 'ఆంధ్ర ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' తర్వాత 'ఏపీ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' గా మార్చాం. స్టేట్‌ బైఫరిఫికేషన్‌ కారణంగా రెండు రాష్ట్రాలకు ఒకే ఆఫీస, ఎలాంటి సందేహాలు ఉండకూడదని 2015లో 'తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌'గా మార్చాం. ఈ రెండు గవర్నమెంట్‌ల గుర్తింపు పొందిన బాడీలుగా పనిచేస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో కొన్ని ఆర్గనైజేషన్స్‌ కొత్తగా ఇవే పేర్లు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మెంబర్లు మోసపోయి సభ్యత్వం తీసుకుంటున్నారు. ఆ మధ్య అవార్డులు కూడా ఇస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఫిలిం ఛాంబర్‌ తరుపున ఇప్పటివరకూ ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వం. ప్రభుత్వం అవార్డు ఫంక్షన్లు జరిపితే ప్రభుత్వానికి మా ఆర్గనైజేషన్‌ తరపున సహకారం అందిస్తున్నాం. సినిమా టైటిల్స్‌ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. హిందీ టైటిల్స్‌ కూడా ఇక్కడ ఛాంబర్‌ లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.
కానీ తర్వాత దాని హిందీ అనుబంధ సంస్థలకు సమాచారం అందిచాల్సి ఉంటుంది. ఈ మధ్య ఆ గందరగోళం కూడా ఎక్కువైంది. కొత్తగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే మెంబర్లు ఎవరైనా సరైన సంస్థ ను గుర్తించి ఏ సంస్థలో మేముంటే బాగుంటుందని ఆ సంస్థలోనే ఉండి మీ వ్యాపారం చేసుకునే నిర్ణయాలు తీసుకుని సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాంటి ఇబ్బందులుంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అనిపిస్తే దాన్ని ఏ విధంగాం పరిష్కరించాలనే దానిమీద స్వయంగా మమ్మల్ని సంప్రదించాల్సింది గా కోరుతున్నాం. దీనికి సంబంధించి 'అడహాక్‌' కమిటీ ఏర్పాటు చేశాం. దీనిలో అన్ని ఆర్గనైజేషన్స్‌ ఉన్నాయి. సి.కళ్యాణ్‌, కే.ఎల్‌.దామోదర ప్రసాద్‌, పి.రామ్మోహనరావ, కె.మురళీమెహన్‌, బూరుగు పల్లి శివరామక ష్ణ, కొడాలి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఎన్‌. సుధాకర్‌రెడ్డి, పి.సత్యారెడ్డి, ఎం. విజయేందర్‌రెడ, కె.బసిరెడ్డి, వి.ఎల్‌.శ్రీధర్‌, ఫెడరేషన్‌ అధ్యక్షులు, దర్శకుల సంఘ అధ్యక్షులు మెంబర్లుగా కమిటీను ఏర్పాటు చేయడం జరిగిందిల..
ఏ మెంబర్‌కు అయినా ఇలాంటి ఇబ్బంది ఎదురైనపుడు ఈ కమిటీ మెంబర్స్‌లో ఎవరినైనా కలిసి చెప్పుకోవచ్చు. వీరు వాళ్లకి సరైన సమాచారం ఇస్తారని ఈ సందఠంగా తెలియజేస్తున్నాం' అని అన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి మురళీ మోహన్‌ మాట్లాడుతూ... సినిమా వెల్ఫేర్‌ అనేది మా బాధ్యత. వాళ్ల ఇబ్బందులను మా సంస్థ ద్వారా తీర్చడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాం, అయితే కొత్తగా వచ్చే వారు సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది' అని అన్నారు.
'మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ '' సినిమాలకు సంబంధం లేని వారు కూడా సొంతంగా కొంత మంది అసోసియేషన్లు స్టార్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సమస్య మాకు ఎదురైంది. వాళ్లు మాకు ఫోన్‌ చేసి మా అసోసియేషన్‌లో వారిని కలపమని అడిగారు. కానీ కుదరదని చెప్పాం. ఇలాంటి సంస్థల నుంచి జాగ్రత్తగా ఉండాలని కొత్త వారిని కోరుతున్నాం'' అని అన్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... పుట్టగొడుగులుగా వస్తోన్న ఛాంబర్స్‌ గానీ, ఫెడరేషన్‌ పెట్టిన వారు మన ప్రస్తుత మెంబర్స్‌ మన ఎక్స్‌ మెంబర్స్‌గా ఉండే చేస్తున్నారు. ఈ సమస్యని ఇప్పడు మీ ముందుకు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే కొత్తగా వచ్చే సభ్యులను తప్పుదోవపట్టిస్తున్నారు. కాబట్టి కొత్తగా వచ్చేవారు మంచి నిర?యం తీసుకుని ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలలోనే చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.?ఈ కార్యక్రమంలో జెమిని కిరణ్‌, కొడాలి వెంకటేశ్వరరావు, ఏడిద శ్రీరామ్‌, వి.విరి నాయుడు, వీర్రాజు, శ్రీధర్‌, ముత్యాల రాందాసు తదితరులు పాల్గొన్నారు.