షూటింగ్ అంటేనే భయపడుతున్న తెలుగు యాంకర్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
అంతా బాగుందనుకున్నా ప్రముఖ యాంకర్లతో బుల్లితెరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షూటింగ్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట. దీంతో ఏం చేయాలో పాలుపోక సదరు ప్రోగ్రాం నిర్మాణ సంస్థలు తల పట్టుకుంటున్నాయని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైనే షూటింగ్‌లు ఆగిపోయాయి. బుల్లితెర అయినా.. వెండితెర అయినా కొద్దిమంది ప్రముఖులతో నడిచేది కాదు.. దీనిపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. చిన్న చిన్న ఆర్టిస్టులు ఇతరత్రా సిబ్బంది మొత్తం రెండు నెలలు షూటింగ్స్ ఆగిపోవడంతో బతుకు బండిని ఎలా నడపాలో తెలియక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
ఈ విషయాలన్నీ చిత్ర సీమకు చెందిన పెద్దలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చింది. ఇటీవల బుల్లితెర పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి షూటింగ్‌లు షురూ చేసింది. అయితే ప్రారంభించి కొద్ది రోజులు కూడా గడవక ముందే పలువురు ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. వారంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయినా సరే స్టార్ యాంకర్‌లు ససేమిరా అంటున్నారని సమాచారం.
బుల్లితెర స్టార్ యాంకర్లు సుమ, అనసూయ షూటింగ్ అంటేనే భయపడి పోతున్నారట. ఇప్పుడప్పుడే వద్దంటున్నారని సమాచారం. కరోనా కంట్రోల్‌లోకి వచ్చి పరిస్థితులు చక్కబడే వరకూ షూటింగ్‌లకు విరామం ఇవ్వాలంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వారు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయం కూడా తీసేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే సదరు షో నిర్వాహకులు వేరొకరితో వీరి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తారో లేదంటే కొద్ది రోజులు వాయిదా వేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments