Modi:కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణ నలిగిపోతుంది.. ప్రధాని మోదీ విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోతుందని ప్రధాని మోదీ వాపోయారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. నాగర్ కర్నూలులో జరిగిన పార్టీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల ఆదరణ చూస్తుంటే బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని అర్థమవుతోందన్నారు. ఈసారి దేశంలో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమని ప్రధాని జోస్యం చెప్పారు. గత పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తయారయ్యారని విమర్శలు చేశారు.
"కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. మేము ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దళిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను యాదాద్రి సాక్షిగా తీవ్రంగా అవమానించింది. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రాష్ట్ర ప్రజల కలలను ఈ రెండు పార్టీలు ధ్వంసం చేశాయి. రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది. తెలంగాణను గేట్‌వే ఆఫ్ సౌత్ అంటారు. ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. మీ కోసమే అహర్నిశలు పనిచేస్తున్నాను. ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు" అని తెలిపారు.
"గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు దశాబ్దాల క్రితమే ఇచ్చారు. కానీ పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే. కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది. 80 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ధి పొందారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకే ఎక్కువ మేలు జరిగింది. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోంది. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేశారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎం చేస్తామని మాట తప్పారు. కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారు" అంటూ మోదీ విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com