సామూహిక వ్యాప్తి దిశగా తెలంగాణ.. ప్రస్తుతానికి ఏపీ సేఫ్
- IndiaGlitz, [Monday,June 22 2020]
కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా కొనసాగుతోందా? అంటే ఇండియా ఇన్ పిక్సల్స్ అవుననే అంటోంది. ఇది తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సామూహిక వ్యాప్తికి 122 శాతం అవకాశం ఉందని ఇండియన్ పిక్సల్స్ వివరించింది. అంతే కాదు.. దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలోనే 65 శాతం వ్యాప్తికి అవకాశముందని ప్రకటిస్తే.. ఢిల్లీ 143 శాతంతో దేశంలోనే సామూహిక వ్యాప్తికి అవకాశమున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలవగా.. రెండవ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే ఏపీకి మాత్రం ఈ ప్రమాదం చాలా తక్కువని ఇండియన్ పిక్సల్స్ ప్రకటించింది. ఏపీలో సామూహిక వ్యాప్తికి 8 శాతం అవకాశం మాత్రమే ఉందని వెల్లడించింది.