Telangana Voters:తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. 22లక్షల ఓట్లు తొలగించాం: సీఈసీ

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. 2022-23లో 22లక్షల ఓట్లను తొలగించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ ఈ పర్యటనలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని.. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో 8.11 లక్షల మంది కొత్తగా యువ ఓటర్లు నమోదు కావడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉండటం కూడా శుభపరిణామన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో సగటున 897 ఓటర్లు ఉన్నారని సీఈసీ వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో 88 జనరల్ సీట్లు ఉండగా, 12 ఎస్టీ, 19 ఎస్సీ సీట్లు ఉన్నాయని తెలిపారు.

80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం..

హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని.. తెలంగాణలో ఓటర్లు సంఖ్య మొత్తం 3.17కోట్లుగా ఉందని వివరించారు. అందులో 80 ఏళ్లకు పైబడిన వారు 4.43లక్షలు ఉండగా.. వందేళ్లు దాటిన వారు 7,600 మంది.. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,557 మంది ఉన్నారన్నారు. తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెల్లిబుచ్చాయని.. అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగొచ్చని తెలిపాయని చెప్పారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేస్తే సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం..

కాగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను బృందం పరిశీలించింది. తెలంగాణ సీఎస్‌, డీజీపీతో తొలుత సమావేశమైన సీఈసీ బృందం తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులో భేటీ అయింది. నేటితో ఎన్నికల బృందం పర్యటన ముగియడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

More News

Chandrababu:రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చి.. రూ. 6లక్షల కోట్లకు చేరిన చంద్రబాబు ఆస్తి

కొంతమంది అంతే... స్వీయ ఆరాధనాభావనతో బతుకుతుంటారు. తాను అందగాడిని.. తాను తెలివైనవాడిని..

Senior journalist Uma Sudhir:టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్ర ఆగ్రహం

మంత్రి రోజాపై టీడీపీ సీనీయర్ బండారు సత్యానారాయణ చేసిన దారుణ వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్రంగా ఖండించారు.

Pawan Kalyan:ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జనసేన.. పవన్ మాటల వెనక ఆంతర్యమేంటి..?

కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Kavitha:మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా? అని నటి కవిత ఆగ్రహం

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సినీ నటి కవిత తీవ్రంగా ఖండించారు.

Prema Vimanam:ఫన్, ఎమోషన్‌ మేళవింపుగా 'ప్రేమ విమానం' .. ఆకట్టుకుంటున్న ట్రైలర్, జీ5లో డైరెక్ట్ రిలీజ్

భారతదేశంలో ఓటీటీ మార్కెట్ నానాటికీ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తూ..