తెలంగాణలో 7,994 మందికి కరోనా.. గాంధీకి రావొద్దంటున్న వైద్యులు

  • IndiaGlitz, [Thursday,April 29 2021]

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ విధించి తగు చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు అయితే ఏమీ ఉండటల్లేదు. తాజాగా తెలంగాణలో దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే మాత్రం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న 8 వేల పై చిలుకు కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,27,960కు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 58 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2208కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 4009 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 3,49,692 మంది కోలుకున్నారు. తెలంగాణలో మరణాల రేటు 0.51 శాతం ఉండగా... కోలుకున్న వారి రేటు 81.71 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 76,060గా ఉంది.

కాగా.. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 80,181 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 4,725 మందికి చెందిన రిపోర్టులు రావల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1630 కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌ 615, రంగారెడ్డి జిల్లాలో 558, నల్గొండ 424, సంగారెడ్డి 337, నిజామాబాద్ జిలాల్లో 301, సిద్దిపేట 269, సూర్యాపేట 264, జగిత్యాల జిల్లాలో 238 కేసులు నమోదయ్యాయి. కాగా.. గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఫుల్ అయ్యాయి. ఐసీయూలో 625 బెడ్లు ఉండగా.. మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇక 1256 ఆక్సిజన్ బెడ్లు ఉండగా అవి కూడా నిండిపోవడంతో గాంధీ సిబ్బంది కరోనా రోగులను కింగ్ కోఠి, టిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గాంధీకి రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.

More News

గంట వ్యవధిలో భిన్నమైన స్టేట్‌మెంట్స్.. లాక్‌డౌన్ లేనట్టేనట..

బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో తెలంగాణలో రెండు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అవేంటంటే 30 తరువాత ఏ క్షణమైనా లాక్‌డౌన్ విధించవచ్చనేది ఒకటి..

కరోనాకు చెక్ పెట్టిన ‘లవ్ స్టోరీ’.. ఇన్‌స్పైరింగ్..

శేఖర్ కమ్ముల దర్వకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ల‌వ్ స్టోరీ’.

కరోనా వ్యాక్సిన్ 50 శాతం వ్యాప్తిని అరికడుతుందట..

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం కరోనా బారిన పడుతుండటంతో పాటు..

'ఎదురీత' సెన్సార్ పూర్తి... త్వరలో విడుదలకు సన్నాహాలు

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఎదురీత'.

టీటీడీ తాత్కాలిక ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో కార్యకలాపాలు చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.