తెలంగాణలో కొత్తగా 7,646 మందికి కరోనా..

  • IndiaGlitz, [Friday,April 30 2021]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. 7 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,646 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 53 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,35,606కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 2,261కు చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం బాగానే ఉంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 5926 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 3,55,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతం ఉండగా.. కోలుకున్న వారి రేటు 81.63 శాతంగా ఉంది. కాగా.. నిన్న 77,091 నమూనాలను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 4,492 మందికి చెందిన రిపోర్టులు రావల్సి ఉందని వెల్లడించింది.

కాగా.. తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి ఉంది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1441 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లా పరిధిలో 484 కేసులు, సంగారెడ్డి 401, సిద్దిపేట 289, సూర్యాపేట 283, జగిత్యాలలో 230, కరీంనగర్ 274, ఖమ్మం 212, మాజాబుబ్ నగర్ 243, నల్గొండ 285, నిజామాబాద్ 330 చొప్పున కేసులు నమోదయ్యాయి.

More News

మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ ఇక లేరు..

మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్

ప్రముఖ నటుడు సిద్దార్థ్‌కు తమిళనాడుకు చెందిన బీజేపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతి

ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఆయనకు గుండెపోటు రావడంతో క‌న్నుమూశారు.

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమ ఫలితాన్నిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.