తెలంగాణలో కొత్తగా 7,646 మందికి కరోనా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. 7 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,646 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 53 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,35,606కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 2,261కు చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం బాగానే ఉంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 5926 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 3,55,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతం ఉండగా.. కోలుకున్న వారి రేటు 81.63 శాతంగా ఉంది. కాగా.. నిన్న 77,091 నమూనాలను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 4,492 మందికి చెందిన రిపోర్టులు రావల్సి ఉందని వెల్లడించింది.
కాగా.. తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి ఉంది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1441 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లా పరిధిలో 484 కేసులు, సంగారెడ్డి 401, సిద్దిపేట 289, సూర్యాపేట 283, జగిత్యాలలో 230, కరీంనగర్ 274, ఖమ్మం 212, మాజాబుబ్ నగర్ 243, నల్గొండ 285, నిజామాబాద్ 330 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout