సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ సచివాలయ అంశం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సచివాలయ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చివేసి.. శ్రావణ మాసంలో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం ప్రస్తుతమున్న సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. తమ వాదనను వినకుండా ఆదేశాలివ్వొద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా.. సచివాలయ భవనాల కూల్చివేతను సోమవారం వరకు నిలిపేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారమే జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 50 శాతం సచివాలయ భవన నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేసింది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే పరిస్థితేంటనేది చర్చనీయాంశంగా మారింది. కాగా.. సచివాలయ భవన నిర్మాణ కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout