సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ సచివాలయ అంశం

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

తెలంగాణ సచివాలయ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చివేసి.. శ్రావణ మాసంలో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం ప్రస్తుతమున్న సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. తమ వాదనను వినకుండా ఆదేశాలివ్వొద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

కాగా.. సచివాలయ భవనాల కూల్చివేతను సోమవారం వరకు నిలిపేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారమే జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 50 శాతం సచివాలయ భవన నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేసింది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే పరిస్థితేంటనేది చర్చనీయాంశంగా మారింది. కాగా.. సచివాలయ భవన నిర్మాణ కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More News

ధారావిపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు..

కరోనా వైరస్ ఇండియాలో అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో అందరి చూపు ధారావిపైనే పడింది.

స‌మంత బ్యూటీ థెర‌ఫీ

స్టార్ హీరోయిన్ స‌మంత లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

హాస్పిట‌ల్‌లో ప్ర‌ముఖ విల‌న్... క‌మ‌ల్ సాయం

పొన్నాంబ‌ళం...ఈ పేరు ఏదో త‌మిళ న‌టుడు క‌దా! అనిపించ‌వ‌చ్చు కానీ.. విల‌న్ క‌బాలి తెలుసా?

కాకతాళీయంగా జరిగింది.. సహృదయంతో అర్థం చేసుకోండి: కేసీఆర్

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చి వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి కాస్త దెబ్బతిన్నాయి.

ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.