హైకోర్టు చెప్పినా వినరా? అంబులెన్స్‌లను అడ్డుకున్న పోలీసులు.. 

  • IndiaGlitz, [Friday,May 14 2021]

ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా? అంటూ హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. నేడు గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసులు ఏకంగా 20 అంబులెన్సులను అడ్డుకున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఒక రోగి మృతి చెందాడు. హైకోర్టు ఆదేశాలతో రెండు రోజులుగా ఏపీ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. అయితే గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి.

నూతన ఆదేశాలివే..

ఇతర రాష్ట్రాల నుంచి కరోనా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు వస్తున్న వాళ్ళ కోసం తెలంగాణ సర్కార్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో బెడ్‌ కన్ఫర్మేషన్‌ పత్రాన్ని.. కంట్రోల్ రూమ్‌కు పంపితే ఈ-పాస్‌ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ పేషేంట్ల ఆడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని నిబంధన. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 0402465119, 9494438351 లకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నుంచి అడ్మిషన్ ప్రపోజల్ లెటర్ ఉంటే, పేషేంట్‌ను తీసుకు వచ్చేందుకు కంట్రోల్ రూమ్ అనుమతులివ్వనుంది.

ఉమ్మడి రాజధానికి రావడానికి అభ్యంతరాలేంటి?

కాగా.. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై ఏపీ వైద్యాధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ఉమ్మడి రాజధానికి రావడానికి అభ్యంతరాలేంటని ఏపీ వైద్యవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆస్పత్రి అనుమతి, ఈ-పాస్‌ తీసుకునే వరకు రోగి పరిస్థితి ఏంటని ఏపీకి చెందిన వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో బెడ్ లేకుండా అంత దూరం ఎలా వస్తారని ఏపీ వైద్యవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లను ఆపేసి రోగి ప్రాణాలతో తెలంగాణ పోలీసులు చెలగాటమాడుతున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. అంతమంది తమ పర్మిషన్ లెటర్స్ చూపించి ఆసుపత్రికి వెళ్లేవరకూ రోగి ప్రాణాలు నిలుస్తాయా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పుల్లూరు టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన అంబులెన్స్‌లు

కాగా.. నేడు పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంబులెన్స్‌లు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ ఆస్పత్రిలో బెడ్‌ కన్ఫర్మేషన్‌ ఉందన్నా తెలంగాణ పోలీసులు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ తన భర్తను కర్నూలు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా.. ఆక్సిజన్ బెడ్ లేదని ఆస్పత్రిలో కర్నూలు జీజీహెచ్ సిబ్బంది చేర్చుకోలేదు. దీంతో తన భర్తను ఎలాగైనా బతికించుకోవాలని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పయనమైంది. కానీ పుల్లూరు వద్ద తెలంగాణ పోలీసులు ఆపేశారు. అంబులెన్స్‌లోని ఆక్సిజన్ అయిపోతుందని సదరు మహిళ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

More News

ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

పిల్లలు ఎటు వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే అమ్మ కోసమే వెదుక్కుంటారు. పెద్దవాళ్లైన తర్వాత కూడా దీనిలో మార్పైతే ఏమీ ఉండదు.

కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది.

టీఎన్నార్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి సాయం

ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి సాయం అందజేస్తున్నారు.

మరో క్రికెటర్‌కు సోనూసూద్ సాయం..

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను చిన్నారులకు కూడా వేసేందుకు లైన్ క్లియర్ అయింది.