పెండింగ్ చలానాలకు మంచి రెస్పాన్స్... ఖజానాకు ‘‘పైసా వసూల్’’
Send us your feedback to audioarticles@vaarta.com
పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేవారికి రాయితీ ఇస్తూ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.30 కోట్ల చలానాలు క్లియర్ అవ్వడంతో పాటు ప్రభుత్వ ఖజానాలో రూ.130 కోట్లు జమయ్యాయి. వీటిలో ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే 80 శాతం ట్రాఫిక్ చలానాలు క్లియర్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు రూ.500 కోట్ల విలువైన చలానాలకు రాయితీ ఇవ్వగా.. రూ.130 కోట్లు వసూలయ్యాయని పోలీసులు తెలిపారు. మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాల ద్వారా రూ.300 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. రాయితీ సదుపాయాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
కాగా.. తెలంగాణ పోలీసులు పెండింగ్ చలాన్ల చెల్లింపుపై మార్చి 1 నుంచి 31వ తేదీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, నెట్‌బ్యాంకింగ్‌లతో పాటు మీసేవ / ఈసేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం రాయితీని ప్రకటించగా.. కార్లు, మోటార్ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే తోపుడు బండ్ల నిర్వాహకులకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీలను ప్రకటించారు. ఇక.. మాస్కు ధరించకుండా తిరిగిన వారికి విధించిన రూ.వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుందని పోలీస్ శాఖ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout