పెండింగ్ చలానాలకు మంచి రెస్పాన్స్...  ఖజానాకు ‘‘పైసా వసూల్’’

  • IndiaGlitz, [Thursday,March 17 2022]

పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేవారికి రాయితీ ఇస్తూ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.30 కోట్ల చలానాలు క్లియర్‌ అవ్వడంతో పాటు ప్రభుత్వ ఖజానాలో రూ.130 కోట్లు జమయ్యాయి. వీటిలో ఒక్క హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచే 80 శాతం ట్రాఫిక్‌ చలానాలు క్లియర్‌ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు రూ.500 కోట్ల విలువైన చలానాలకు రాయితీ ఇవ్వగా.. రూ.130 కోట్లు వసూలయ్యాయని పోలీసులు తెలిపారు. మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాల ద్వారా రూ.300 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. రాయితీ సదుపాయాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

కాగా.. తెలంగాణ పోలీసులు పెండింగ్ చలాన్ల చెల్లింపుపై మార్చి 1 నుంచి 31వ తేదీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, నెట్‌బ్యాంకింగ్‌లతో పాటు మీసేవ / ఈసేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం రాయితీని ప్రకటించగా.. కార్లు, మోటార్ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే తోపుడు బండ్ల నిర్వాహకులకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీలను ప్రకటించారు. ఇక.. మాస్కు ధరించకుండా తిరిగిన వారికి విధించిన రూ.వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుందని పోలీస్ శాఖ తెలిపింది.

More News

ఈ సొసైటీ గెలిచినవాడి మాటే నమ్ముతుంది ... ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘‘గని’’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

సమ్మక్క- సారలమ్మలపై వ్యాఖ్యలు: చిక్కుల్లో చిన్నజీయర్ స్వామి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆదివాసీల నిరసన

ప్రముఖ ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆదివాసీల వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను

బిబిసి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న  ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌  మోషన్ పోస్టర్‌ విడుదల

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌  వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5.

చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న "బిచ్చగాడు 2" థీమ్ సాంగ్

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు.  ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో  సీక్వెల్ రూపొందుతోంది.

వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.