Telangana Ministers:తెలంగాణ మంత్రుల జాబితా ఇదే.. 11 మందికి చోటు..
Send us your feedback to audioarticles@vaarta.com
కాసేపట్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మంత్రుల జాబితాను గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు పంపించారు. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క్, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరస్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులకు నియమితులైన వారికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే ఫోన్లు చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు.. బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు.. పబ్లిక్ గార్డెన్ నుంచి స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు.. సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. అటు డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు లక్షమంది సభకు హాజరు కావొచ్చుని.. స్టేడియంలో 30వేల మంది కూర్చోవచ్చు. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout