Konda Surekha :తెలంగాణ మంత్రి కొండా సురేఖకు తీవ్ర అనారోగ్యం.. సెల్ఫీ వీడియో విడుదల..

  • IndiaGlitz, [Tuesday,February 20 2024]

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల అసెంబ్లీలో కానీ మీడియా ఎదుట కనపడటం లేదు. దీంతో ఆమెకు ఏమైందనే చర్చ జోరందుకుంది. అయితే ఆమె కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరంలో గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితం అయ్యారు. అభిమానుల ఆందోళన నేపథ్యంలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె తీవ్ర నీరసంగా కనపడుతున్నారు.

గత కొన్ని రోజులుగా నేను అసెంబ్లీ రాకపోవడం, ప్రజల మధ్య కనిపించకపోవడంతో ఎందుకు రావట్లేదు అనే చర్చ సాగుతోంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, డెంగ్యూ ఫీవర్‌ రావడం వల్లే బయటకు రాలేక, ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాను. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాను అని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె.. ఐదు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో చికిత్స తీసుకుంటూ విశ్రాంతి పొందుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూనే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. మరో మంత్రి సీతక్క మేడారం జాతరకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా తమ నాయకురాలు డెంగ్యూ బారిన పడినట్లు తెలుసుకున్న సురేఖ అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. ఆ వనదేవతలే తమ నాయకురాలికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.

More News

Medaram:వనదేవతల మహాజాతర.. తెలంగాణ కుంభమేళాకు ముస్తాబైన మేడారం..

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు ఘడియలు సమీపించాయి.

Alla Ramakrishna Reddy:సొంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. త్వరలో సీఎం జగన్‌తో భేటీ..!

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత..

TS Group-1: తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్ రద్దు.. TSPSC కీలక నిర్ణయం..

తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ మరోసారి రద్దైంది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్న TSPSC బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో కీలకమైన పోస్టులను

Pawan Kalyan: మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. సముచిత స్థానం కల్పిస్తాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని.. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. టీ కొట్టులు, కటింగ్ షాపులు, హోటల్స్‌లో ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్యే ప్రధాన పోటీ