ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. ‘‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ అని తేలింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. నాతో గత కొద్ది రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్న వారంతా దయచేసి ఐసోలేషన్‌లో ఉండిపోండి. అలాగే కరోనా పరీక్ష చేయించుకోండి’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.
తెలంగాణలో ఇప్పటి ఎవరూ ఎందరో ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య దాదాపు 20కి పైగా ఉండవచ్చని తెలుస్తోంది. గత జూన్‌లో హరీశ్ పీఏకు పాజిటివ్ రాగా.. తాజాగా ఆయనకు కరోనా సోకింది. దీంతో హరీష్‌రావుతో కాంటాక్ట్‌లో ఉన్న నేతలు కొందరు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout