ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రి హరీశ్‌‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. ‘‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ అని తేలింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. నాతో గత కొద్ది రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్న వారంతా దయచేసి ఐసోలేషన్‌లో ఉండిపోండి. అలాగే కరోనా పరీక్ష చేయించుకోండి’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.

తెలంగాణలో ఇప్పటి ఎవరూ ఎందరో ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య దాదాపు 20కి పైగా ఉండవచ్చని తెలుస్తోంది. గత జూన్‌లో హరీశ్ పీఏకు పాజిటివ్ రాగా.. తాజాగా ఆయనకు కరోనా సోకింది. దీంతో హరీష్‌రావుతో కాంటాక్ట్‌లో ఉన్న నేతలు కొందరు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

More News

క్రిష్ సినిమాకు ఆధారం అదేనా..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది. షూటింగ్ ఆపేశాడు.

'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన సీపీ

విశాఖ శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడని పోలీసులు అరెస్ట్ చేశారు.

సుశాంత్ సీబీఐ ద‌ర్యాప్తుపై విజ‌య‌శాంతి సూటి ప్ర‌శ్న‌

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని అంద‌రూ అనుకుంటే..

కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో కరోనా పరిస్థితులు పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన నివేదిక