Harish Rao:కాళేశ్వరానికి భూమిని దానం చేసిన అంబటి రాయుడు, తొలి సంతకం ఆయనదే : నిజం బయటపెట్టిన హరీశ్ రావు

  • IndiaGlitz, [Friday,February 17 2023]

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సిద్ధిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్‌ను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రికెటర్ అంబటి రాయుడు, సినీనటుడు నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేటతో అంబటి రాయుడికి మంచి సంబంధం వుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకరంన్నర భూమి ఇచ్చాడని ప్రశంసించారు. మనదేశ జనాభా 140 కోట్లు అయితే అందులో కేవలం 11 మంది మాత్రమే క్రికెట్ ఆడుతారని, ఆ 11 మందిలో మన తెలుగు బిడ్డ అంబటి రాయుడు ఒకడని హరీశ్ కొనియాడారు.

సిద్ధిపేటలో అంబటి రాయుడికి ఫాంహౌస్:

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సిద్ధిపేటకు నీళ్లు అందించేందుకు కాలువలు తవ్వాల్సి వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. అయితే సిద్ధిపేటలో అంబటి రాయుడికి ఫాంహౌస్ వుందని, ప్రభుత్వం ప్రతిపాదించిన కాలువ ఆయన వ్యవసాయ క్షేత్రం మీదుగా వెళ్తుందని మంత్రి చెప్పారు. దీంతో కాలువ కోసం భూమి ఇవ్వాలని అధికారులు చేసిన విజ్ఞప్తికి పెద్ద మనసుతో సమ్మతించిన అంబటి రాయుడు తన ఎకరంన్నర భూమిని అప్పగించాడని హరీశ్ రావు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదని మంత్రి వెల్లడించారు. రైతుల మేలు కోరి తన భూమిలో ఎకరంన్నర భూమిని ప్రభుత్వానికి అప్పగించాడని, దీని వల్ల ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణం జరిగి సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతోందని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. తాను సినిమాలు తక్కువగా చూస్తానని.. కానీ నాని నటించిన జెర్సీ సినిమా చూసినట్లు ఆయన తెలిపారు. దసరా సినిమా రీసౌండ్ ఇండియా మొత్తం వినిపించాలని నాని అభిమానులను కోరాడు.

సిద్ధిపేట గల్లీల్లో తిరిగా : అంబటి రాయుడు

అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ.. సిద్ధిపేటతో తనకు ఎంతో అనుబంధం వుందని, ఈ పట్టణంలోని గల్లీల్లో తిరిగానని చెప్పారు. పదేళ్లలో సిద్ధిపేటకు ఎన్నోసార్లు చూశానని.. కానీ ఇంత పెద్ద స్థాయిలో ప్రజలను కలవడం ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. సీఎం కేసీఆర్‌కు తాను పెద్ద అభిమానినని అంబటి రాయుడు అన్నారు. టీమిండియాలో మరింత మంది తెలుగువాళ్లు ఆడాలని ఆయన ఆకాంక్షించారు. సిద్ధిపేటలో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌కు అంబటి విజ్ఞప్తి చేశారు.

హరీశ్ రావు సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు : నాని

తర్వాత నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. తన కొత్త సినిమా దసరా గురించి ప్రస్తావించారు. తెలంగాణ యాసలో దసరా సినిమాలోని డైలాగ్స్ చెప్పి ఆయన ఆకట్టుకున్నారు. మంత్రి హరీశ్ రావు తన వాహనంలో ఓ ఫ్యామిలీ మెంబర్‌లా తనను తీసుకొచ్చాడని నాని తెలిపారు. వీలైతే మళ్లీ దసార సినిమా సక్సెస్ మీట్ కోసం సిద్ధిపేటకు వస్తానని నాని స్పష్టం చేశారు.

More News

SS రాజమౌళి చేతులమీదుగా MM శ్రీలేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ఆవిష్కరణ

ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా,

Taraka Ratna : తారకరత్న బ్రెయిన్‌కు పరీక్షలు.. ప్రజంట్ హెల్త్ కండీషన్ ఏంటంటే..?

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు.

Veydaruvey:సాయిధరమ్ తేజ్  చేతుల మీదుగా 'వెయ్ దరువెయ్' టీజర్ రిలీజ్

సుప్రీం సాయిధరమ్ తేజ్   మాట్లాడుతూ ఈ సినిమా టీజర్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది,

Rana Naidu : వెంకీ నోటి వెంట బండ బూతులు.. ఫ్యామిలీ ఆడియన్స్‌ యాక్సెప్ట్ చేస్తారా ..?

విక్టరీ వెంకటేశ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలుగా వున్న అగ్రకథానాయకుల్లో

Kanna Lakshmi Narayana:ఇమడలేకపోతున్నా : బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై.. వెళ్తూ, వెళ్తూ వీర్రాజుపై వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.