హోం క్వారంటైన్లో మంత్రి ఎర్రబెల్లి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకూ ఈ మహమ్మారి అందరినీ పట్టి పీడిస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధులంతా హోం క్వారంటైన్లో గడపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటీవల మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హోం క్వారంటైన్ గడపుతున్నారు.
ఎర్రబెల్లి పీఏతో పాటు ఇద్దరు గన్మన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవరు, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉన్న పీఏలు, గన్మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout