తెలంగాణలో అందరూ మాస్క్‌లు వాడాల్సిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చాలా మందిలో ‘కరోనా’ సోకినప్పటికీ వారిలో వ్యాధి లక్షణాలు కనబడటం లేదని, అందుకే, ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించింది. బయటికి వచ్చేటప్పుడు, కార్యాలయాల్లో, ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పసరిగా మాస్క్‌లు వాడాల్సిందేనని.. ఈ మేరకు కొన్ని జాగ్రత్తలను సైతం చెబుతూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి ఫాలో అవ్వండి..

- ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహించండి.
- బయట పనిచేసేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే.
- మాస్క్‌ ధరించే ముందు.. తీసే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి
- మాస్క్ ధరించే ముందు.. శుభ్రంగా ఉతికిన దాన్నే వాడాలి
- మాస్క్‌కు చెమట పట్టినా.. శుభ్రంగా లేకపోయినా వెంటనే మార్చేయండి
-వాడిన తర్వాత సబ్బు నీళ్లు లేదా వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
- తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే యూజ్ అండ్ త్రో మాస్కులు వాడాలి.

కాగా.. జపాన్ లాంటి దేశాల్లో మాస్క్‌లు ఎక్కువగా వాడకం వల్ల కరోనాను చాలా వరకు ఆ దేశీయులు దరికి రానివ్వలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతోంది. ఇదిలా ఉంటే.. కరోనా లాక్‌డౌన్ పొడిగించే విషయమై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్ పొడగిస్తామని పరోక్షంగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేసిన విషయం విదితమే.

More News

సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా

కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషల్

టైటిల్ చ‌దివిన త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే. వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు ఏం చేసుకున్నారు? అనే సందేహం రావ‌చ్చు.