తెలంగాణలో కరోనా నుంచి కాస్త ఊరట.. తాజాగా ఎన్నంటే..

  • IndiaGlitz, [Monday,August 17 2020]

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య చాలా రోజుల అనంతరం వెయ్యి లోపు నమోదయ్యింది. చాలా రోజుల అనంతరం ప్రజలకు కాస్త ఊరట లభించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 894 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,255కు చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 703 మంది మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 21,420 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2006 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 73,312కి చేరుకుంది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 147 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 85, కరీంనగర్ 69, పెద్దపల్లి 62, సిద్దిపేట 58, మేడ్చెల్-51, వరంగల్ అర్బన్-44, ఖమ్మం 44 చొప్పున కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, భువనగిరి జిల్లాలో ఒకటి చొప్పున కొత్త కేసులు నమోదవగా.. భూపాలపల్లి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7.53 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో 20,291 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76 శాతం దాటింది. రెండు జిల్లాల్లో ఒకటి మాత్రమే కేసు నమోదవడం.. మరో మూడు జిల్లాల్లో ఒక్కటి కూడా కేసు నమోదవడం తెలంగాణవాసులకు ఊరటనిస్తోంది.

More News

పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు..

పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.

ఓ వ్యక్తి ప్రాణం కోసం పుణె నుంచి హైదరాబాద్‌కు గంటలో లంగ్స్ తరలింపు

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించడమే కష్టంగా ఉంది.

కాజ‌ల్‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

అల్లు శిరీష్ మొదలు పెట్టిన గో లోక‌ల్ బీ వోక‌ల్ మూమెంట్ కి విశేష స్పందన

యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్తగా గోలోక‌ల్ బీ వోక‌ల్ అనే ఉద్యమానికి నాంది పలికిన విషయం తెల్సిందే.

విరుచుకుపడిన వైసీపీ కార్యకర్తలు.. ఇక ట్వీట్ చేయనన్న రామ్

ఒక్కసారిగా సంచలన ట్వీట్లు చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన హీరో రామ్.. అంతే స్పీడుగా ఇక ఈ అంశంపై తానేమీ మాట్లాడబోనని తేల్చి చెప్పేశాడు.