బిగ్‌బాస్ 5 తెలుగు: రవి ఎలిమినేషన్.. అన్యాయం జరిగిందంటూ తెలంగాణ జాగృతి ఆందోళన
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షోకు తెలంగాణ సెగ తగిలింది. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోవడమే ఈ రచ్చకు కారణం. బిగ్‌బాస్‌లో తెలంగాణకు చెందిన యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలుగా చెబుతున్న వారు ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆందోళనకు దిగారు. రవి మంచి యాంకర్ అని, బిగ్‌బాస్ హౌస్‌లో తొలి రోజు నుండి తన గేమ్, స్ట్రాటజీతో అందరినీ అలరిస్తున్నాడని.. కానీ రవి తెలంగాణ వాడు కావడం వల్ల ఎలిమినేట్ అయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.
ఇకపోతే బిగ్‌బాస్ 5 తెలుగులో 12వ వారానికి సంబంధించి యాంకర్ రవి ఎలిమినేట్ కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తాడని.. లేనిపక్షంలో టాప్ 5లో వుంటాడని ప్రేక్షకులు అంచనా వేసుకుంటున్న రవి ఎలిమినేట్ కావడం తెలుగు ప్రేక్షకులు ఊహించలేదు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన వారిలో చివరికి కాజల్, రవి మిగిలారు. దీంతో ఇద్దరిలో ఒకరిని కాపాడే అవకాశం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వున్న సన్నీకి వుండటంతో అతడు కాజల్‌ను సేవ్ చేశాడు. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడు. అంతేకాదు కాజల్‌తో పోలిస్తే రవికి తక్కువ ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున తెలిపారు. చివరి వరకు వుంటాడనుకున్న రవి పరిస్ధితులు తారుమారు కావడంతో 12వ వారమే ఇంటి నుంచి వెళ్లిపోవడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com